Health tips | అన్నం వండే ముందు బియ్యం బాగా నానబెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

Health tips : చాలామంది అన్నం వండేముందు బియ్యాన్ని ఎక్కువగా నీళ్లలో నానబెడుతారు. ఇలా బియ్యాన్ని బాగా నానబెట్టి వండటంవల్ల ప్రయోజనాలు చేకూరుతాయని, అన్నం త్వరగా ఉడుకుతుందని వారు చెబుతుంటారు. కానీ బియ్యం ఎక్కువసేపు నానబెట్టి అన్నం వండటంవల్ల ప్రయోజనాల సంగతేమో గానీ, నష్టాలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా మైక్రోవేవ్‌ ఓవెన్‌, ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌లో అన్నం వండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.

  • Publish Date - June 30, 2024 / 04:00 PM IST

Health tips : చాలామంది అన్నం వండేముందు బియ్యాన్ని ఎక్కువగా నీళ్లలో నానబెడుతారు. ఇలా బియ్యాన్ని బాగా నానబెట్టి వండటంవల్ల ప్రయోజనాలు చేకూరుతాయని, అన్నం త్వరగా ఉడుకుతుందని వారు చెబుతుంటారు. కానీ బియ్యం ఎక్కువసేపు నానబెట్టి అన్నం వండటంవల్ల ప్రయోజనాల సంగతేమో గానీ, నష్టాలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా మైక్రోవేవ్‌ ఓవెన్‌, ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌లో అన్నం వండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.

ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌లో వండటం, మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వేడి చేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అదేవిధంగా అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టడం ఆరోగ్యానికి మంచిదికాదని చెబుతున్నారు. అయితే అన్నం వండటానికి కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే బియ్యం నానబెడితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇలా వండటంవల్ల నిద్ర బాగా వస్తుందట. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందట.

అయితే బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టి వండటంవల్ల వాటిలో పోషకాలు నశిస్తాయట. అంతేకాదు వాటిలోని గైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు కూడా పెరుగుతాయట. ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయనేది ఈ జీఐ తెలుపుతుంది. తక్కువసేపు నానబెట్టి వండటం వల్ల ఎంజైమాటిక్ విచ్చిన్నం జరుగుతుంది. బియ్యంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లు సాధారణ చక్కెరలుగా విడిపోతాయి.

ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్‌ లెవల్స్ అమాంతం పెరగకుండా ఉంటాయి. బియ్యాన్ని నీళ్లలో 3-4 గంటలపాటు నానబెట్టడంవల్ల ఆ బియ్యంలోని విటమిన్లు, మినరల్స్ నీటిలో కరిగిపోతాయి. అంటే ఆ బియ్యంలో ఉండే పోషకాలు నశిస్తాయి. అందుకే బియ్యాన్ని 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి.

Latest News