Jishnu Dev Varma : త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌’ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా పురోగమించాలని ఆకాంక్షించారు.

Jishnu Dev Varma

విధాత, హైదరాబాద్ : 2047కు తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని చేరుకోవాలని ఆశిస్తున్నానని.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రెండురోజుల పాటు కొనసాగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులేస్తోందన్నరు. 2047 వికసిత్‌ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగం అని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని, అన్నిరంగాల్లో తెలంగాణవిప్లవాత్మకమార్పులు తెస్తుందన్నారు. 2047నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ చేరుకోవాలని..తెలంగాణ సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తుందని తెలిపారు.

గాంధీ, నెహ్రూ మార్గంలో రేవంత్‌రెడ్డి పాలన: కైలాస్‌ సత్యార్థి

సంక్షేమం..ఆధునిక ఆలోచనలతో కూడిన అభివృద్దితో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాంధీ, నెహ్రూ మార్గంలో పాలన కొనసాగిస్తుందని నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి అన్నారు. తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తోందని, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమవుతుందన్నారు. ష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రైతుల రుణాలు మాఫీ చేయడాన్ని, మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించడాన్ని ఆయన ప్రస్తావించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం దిశగా ఈ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని, 2047లోగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుతుందని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి :

NEOM Sky Stadium : వరల్డ్ వండర్…సౌదీ అరేబియా స్కై స్టేడియం
Akira Nandan | ఏఐతో అకిరా హీరోగా సినిమా… పవన్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్ గెస్ట్ పాత్ర‌ల్లో..!

Latest News