భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం : మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు

భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తెలిపారు. లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు అన్నారు. నిర్మాణంలో ఉన్న ఎఫ్‌సీడీఏ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్యాధునిక వసతులు, సాంకేతికతత పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. జూన్ 2 నాటికి కార్యాలయం ప్రారంభిస్తామన్నారు.

దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి, శ్రీధర్ బాబు అన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఎదురవుతున్న ఒక్కో సమస్యను పరిష్కరించుకంటు ముందుకెలుతున్నామన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఫ్యూచర్ సిటీ ఉద్యోగాలు అందించబోతుందన్నారు. మా ప్రభుత్వ హయాంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి కార్యకలాపాలతో కూడిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించాలని ప్రణాళికగా పెట్టుకున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ ను ఇక్కడికి తరలిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీశ్ రావు, కేటీఆర్ మాట్లాడటం కేవలం అభివృద్దికి అడ్డుకోవడంగానే చూస్తాం అన్నారు. వారు వ్యతిరేక మాటలు మాట్లాడుతునే ఉంటారని..మేం ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ముందుకెలుతునే ఉంటామని తెలిసారు.

Latest News