Atlantis The Royal | ఒక్క రాత్రికి రూ. 8.65 కోట్లు..! అంత ఖ‌రీదు ఎందుకో తెలుసా..?

Atlantis The Royal | మీరు ల‌గ్జ‌రీ లైఫ్( Luxury Life ) అనుభ‌వించాల‌నుకుంటున్నారా..? అదేదో సాదాసీదాగా ఇంట్లో కాకుండా ల‌గ్జ‌రీ హోట‌ల్‌( Luxury Hotel )లో ఎంజాయ్ చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఖ‌రీదు ఎక్కువే.. వేల‌ల్లో, ల‌క్ష‌ల్లో కాదు.. కోట్ల‌లో రూపాయాలు ఖ‌ర్చు పెడితే మీరు కోరుకున్న స‌క‌ల స‌దుపాయాల‌తో ఎంజాయ్ చేయొచ్చు.

Atlantis The Royal | ప్రపంచంలోనే ఇది అత్యంత ఖ‌రీదైన హోట‌ల్( Luxury Hotel ). మీరు ఎప్ప‌టికీ ఇలాంటి ల‌గ్జ‌రీ హోట‌ల్ గురించి విని ఉండ‌రు. ఈ హోట‌ల్‌లో అన్ని ల‌గ్జ‌రీ ఫెసిలిటీసే( Luxury facilities ) ఉంటాయి. కోట్ల రూపాయాల్లో ఖ‌ర్చు భ‌రిస్తే చాలు.. మీ జీవితంలో మీరు ఊహించ‌ని క్ష‌ణాల‌ను అనుభ‌వించొచ్చు.. ఆ స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చు. మ‌రి ఖ‌రీదైన ఆ హోట‌ల్ గురించి తెలుసుకోవాలంటే దుబాయ్‌( Dubai )కు వెళ్లాల్సిందే.

దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయ‌ల్‌( Atlantis The Royal )లోని రాయ‌ల్ మాన్స‌న్ సూట్( Royal Mansion Suit ) అది. ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన హోట‌ల్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మీడియా రిపోర్టుల ప్ర‌కారం.. ఈ రాయ‌ల్ మాన్స‌న్‌లో ఒక్క రాత్రి బ‌స చేయాలంటే రూ. 8.65 కోట్లు చెల్లించాల్సిందే. ఈ హోట‌ల్‌లో మంచి లివింగ్ ఏరియా, ఆక‌ర్షణీయ‌మైన బెడ్రూమ్స్, డైనింగ్ స్పేస్, కిచెన్, బార్, గేమ్ రూమ్‌తో పాటు ఆఫీస్ కార్య‌క‌లాపాల‌కు కూడా ఓ మంచి గ‌ది కూడా ఉంది.

రాయ‌ల్ మాన్స‌న్ సూట్‌కు ఎందుకంత ప్ర‌త్యేక‌త‌..?

ఈ రాయ‌ల్ మాన్స‌న్ సూట్‌కు ఎందుకంత ప్ర‌త్యేక‌త అంటే.. 5,124 చ‌ద‌ర‌పు అడుగుల్లో మంచి స్విమ్మింగ్ ఫూల్, ఇక దీనిపై నుంచి అరేబియ‌న్ సీ( Arabian Sea )తో పాటు పామ్ ఐలాండ్‌( Palm Island )ను వీక్షించేందుకు రెండు కండ్లు చాల‌వు. అందుకే ఈ ల‌గ్జ‌రీ హోట‌ల్‌కు ఎంతో డిమాండ్ ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక‌వేత్త‌లు, కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన బ‌డా బాబులు మాత్ర‌మే ఈ రాయ‌ల్ మాన్స‌న్‌లో బ‌స చేయ‌ల‌రు అనేది న‌గ్న స‌త్యం. రాయ‌ల్ మాన్స‌న్‌లో ఒక్క రాత్రికి పెట్టే ఖ‌ర్చుతో అదే మ‌న హైద‌రాబాద్‌, ఢిల్లీలోనూ అయితే ల‌గ్జ‌రీ కారు, ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేయొచ్చు.