Site icon vidhaatha

Jennifer Lawrence : ఆ హాలీవుడ్ న‌టి పారితోషికం ల‌క్ష‌ల డాలర్లు.. గ‌డిపేది సాధార‌ణ జీవితం.. ఆ డ‌బ్బంతా ఏం చేస్తుంది?

Jennifer Lawrence : ఆమె ప్రపంచంలోనే అత్యంత పేదరాలైన సినీనటి. అయితే మీరు అనుకునేంత పేదరాలేమీ కాదు.. ఇతరులతో పోల్చితే చాలా సాధారణమైన దుస్తులు ధరిస్తుంటుంది. ఆమె నెలవారీ ఇంటి ఖర్చులు 3వేల డాల‌ర్ల‌కంటే త‌క్కువే ఉంటాయంటే ఆశ్చ‌ర్య అనిపించ‌క మాన‌దు. ఆమె పేరు జెన్నిఫ‌ర్ లారెన్స్‌. ఆమెకు విలాస‌వంత‌మైన మాన్ష‌న్లు అంటే ఇష్టం ఉండ‌దు. ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ వెంట కొట్టుకుపోవ‌డం ఆమెకు అస‌లే న‌చ్చ‌దు. ఒక సాధార‌ణ‌మైన కుటుంబంలా త‌న ఇల్లు గ‌డ‌వ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డుతుంది. సినిమాల్లో న‌టించే స‌మ‌యాల్లో ఆమె సాధార‌ణ‌మై, త‌క్కువ అద్దెకు దొరికే అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. ఆ అద్దె కూడా నెల‌కు 4వేల డాల‌ర్ల‌లోపే అంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌లేరేమో. ఆమె వ‌ద్ద ల‌గ్జ‌రీ కార్లు కానీ, ప‌డ‌వ‌లు కానీ, ప్రైవేట్ జెట్‌లు కానీ ఏమీ లేవు. ఆమె బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఒక సెకెండ్ హ్యాండ్ షెవీ కారును వాడుతుంటుంది. ఆ కారు 20 ఏళ్ల క్రితానిద‌ని ఆమె గురించి తెలిసిన‌వారు చెబుతుంటారు.

ఆమె సూప‌ర్ మార్కెట్‌లో ఏమైనా కొనుగోలు చేసే స‌మ‌యంలో డిస్కౌంట్ కూప‌న్స్ వాడుతుంది. డిస్కౌంట్‌పై వ‌చ్చే రోజువారీ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే ఐట‌మ్స్ కొనుగోలు చేస్తుంటుంది. మ‌రి ఆమె సంపాదించిన డ‌బ్బంతా ఎక్క‌డికి పోతున్న‌ది? ఆమె త‌న సంపాద‌న నుంచి 2 మిలియ‌న్ల డాల‌ర్ల‌ను వెచ్చించి కార్డియాక్ ఐసీయూను నెల‌కొల్పింది. అంతే కాదు.. దాదాపు ప‌ది మిలియ‌న్ల డాల‌ర్ల‌ను అమెరికాలో ఆహార కొర‌త సంక్షోభం నివార‌ణ‌కు ఆమె విరాళంగా ఇచ్చారు. పేద‌ పిల్ల‌లు ఆక‌లి బారిన ప‌డ‌కుండా ఆమె స‌హాయం అందిస్తుంటారు. క్రిస్‌మ‌స్ నాడు ఆమె త‌న సొంతూరికి వెళ్లి, అక్క‌డి హాస్పిట‌ల్స్‌ను విజిట్ చేస్తారు. అక్క‌డ చికిత్స పొందుతున్న చిన్నారుల‌తో స‌మ‌యం గ‌డుపుతుంటారు.

హాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకునే సినీ తార‌గా ఉండి కూడా.. ఒక్కో సినిమాకు 15 మిలియ‌న్ డాల‌ర్ల పారితోషికం తీసుకుంటున్నా కూడా.. ఆమె ఎప్పుడూ భౌతిక విష‌యాల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌దు. దాని బ‌దులు త‌న డ‌బ్బుతో ఇత‌రుల‌కు స‌హాయం చేస్తుంటుంది. అవ‌స‌రాల్లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డం త‌న జీవితంలో అత్యంత ముఖ్య‌మని ఆమె త‌ర‌చూ చెబుతుంటుంది. ఆమె త‌న సొంతూరు అయిన కెంట‌కీలోని లూయీస్ విల్లేలో ఒక చిన్నారుల హాస్పిట‌ల్‌ను ప్రారంభించింది. ఇందుకోసం ఆమె విరాళాలు ఇవ్వ‌డమే కాండా.. విరాళాల కోసం క్యాంపెయిన్ నిర్వ‌హించింది. జెన్నిఫ‌ర్ లారెన్స్ ఫౌండేష‌న్ కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పేరిట దీనిని ఆమె నెల‌కొల్పింది. హాస్పిటళ్ల‌ను సంద‌ర్శించిన సంద‌ర్భంగా తాను అనేక మంది చిన్నారుల‌ను క‌లుసుకున్నాన‌ని, వారిలో బ‌లం, తెగువ త‌న‌కు స్ఫూర్తినిచ్చాయ‌ని లారెన్స్ ఒక సంద‌ర్భంలో చెప్పారు. జెన్నిఫ‌ర్ ఉదార‌త‌కు, ఆమె ఇచ్చిన బ‌హుమ‌తికి తాము ఎంత‌గానో సంతోషిస్తున్నామ‌ని ఐసీయూను నెల‌కొల్పిన కొస‌యిర్ చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్ హార్ట్ సెంట‌ర్ నిర్వాహ‌కులు చెప్పారు.

దాతృత్వంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. మ‌హిళ‌ల పున‌రుత్పాద‌క హ‌క్కుల విష‌యంలో ఆమె పోరాటం చేస్తుంటారు. అమెరికాలో త‌న ఫౌండేష‌న్ ద్వారా బాల బాలిక‌ల‌కు క్ల‌బ్‌ల ఏర్పాటుకు స‌హ‌క‌రించారు. ఆమె అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మంలో కీల‌క భాగ‌స్వామురాలు కూడా. 2019లో కూకీ మ‌రోనేను వివాహం చేసుకున్నారు. 2022లో వారికి కె మ‌రోనే పుట్టాడు.

Exit mobile version