విధాత : పక్షులు అప్పుడప్పుడు మనుషులను అనుకరిస్తూ శబ్ధాలు చేయడం..ఒకటి రెండు మాటలు మాట్లాడటం అక్కడక్కడ చూస్తుంటాం. చిలక పలుకుల మాట సంగతి తెలిసిందే. అయితే తాజాగా రష్యా దేశంలోని ఓ పెంపుడు కాకి తన యజమాని మాదిరిగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. రష్యాలోని లిస్వాలో తన యజమానితో సంభాషణ సందర్భంగా కార్లుషా అనే పెంపుడు కాకి “హలో, కార్లు షెచ్కా” వంటి రష్యన్ పదాలను పలుకుతుంది. ధ్యాంక్యూసార్ అంటూ, యజమాని నవ్వగానే తాను కూడా అదే పద్దతిలో నవ్వడం వంటివి చేస్తూ కాకిలందూ.. ఈ మాటలు నేర్చిన కాకి పత్యేకం అంటూ చాటుకుంటుంది.
దాదాపుగా 30 మాటల వరకు ఈ పెంపుడు కాకి మాట్లడటం, జవాబు ఇవ్వడం చేస్తుంది. ధ్వని అనుకరణతో సహా, దాని యజమాని దానిని ప్రశంసించే చెప్పే మాటలను తిరిగి ఆ కాకి చెబుతుంది. చిలుకలలో మాదిరిగానే కాకులు కూడా మాటలు నేర్చుతాయనడానికి ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది.
Hearing a raven speak Russian is one of the most terifying things I’ve ever heard 😭 😂 pic.twitter.com/YVpP3XSC9W
— internet hall of fame (@InternetH0F) November 12, 2025
