TOMCOM ద్వారా.. రష్యాలో ఉద్యోగ అవకాశాలు (పైప్ స్ట్రెయిటెనింగ్ ఆపరేటర్ పోస్టులు)

పైప్ స్ట్రెయిటెనింగ్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న టాంకాం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా రష్యాలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు పైప్ స్ట్రెయిటెనింగ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TOMCOM అధికారులు తెలిపారు.

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రూబుల్స్, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.72,000 వరకు జీతం లభించనుంది. స్టీల్ పైపులను స్ట్రెయిట్ చేసే మెషీన్లను ఆపరేట్ చేయడం, క్వాలిటీ, సైజ్ మరియు సేఫ్టీ ప్రమాణాలు పాటించడం ప్రధాన బాధ్యతలుగా ఉంటాయని తెలిపారు.

పైప్ లేదా ట్యూబ్ తయారీ యూనిట్లలో అనుభవం ఉన్నవారు, స్ట్రెయిటెనింగ్ మెషీన్లపై అవగాహన కలిగినవారు, మైక్రోమీటర్, గేజ్‌లను ఉపయోగించే నైపుణ్యం ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఫ్యాక్టరీ అనుభవం ఉన్న పైప్ ఫిట్టర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే నియామక ప్రక్రియ కావడంతో మధ్యవర్తులు లేకుండా, పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించబడతాయని TOMCOM స్పష్టం చేసింది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రిజ్యూమ్‌ను tomcom.resume@gmail.com కు పంపించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 98496 39539 లేదా 94400 51452 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అవ‌కాశం, ఇంట్రెస్ట్ ఉన్న‌వారు ఈ లింక్ ద్వారా వెంటనే అప్లై చేసుకోవ‌చ్చు. https://docs.google.com/forms/d/e/1FAIpQLSeogljDKmy_fAXraJAR0ThyXkpiGc1Cp86yKNwtCp_Pn3n5kg/viewform?usp=dialog

Latest News