విధాత : అనేక పరిశోధనలు..ట్రయల్స్ మధ్య రూపొందించి ఆవిష్కరణకు సిద్దం చేసిన ఓ రోబో తన డెబ్యూ వేదికపైనే కుప్పకూలిన ఉదంతం రష్యన్ శాస్త్రవేత్తలకు షాక్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా.. రష్యా శాస్త్రవేత్తలు తొలి హ్యూమనాయిడ్ రోబో(AIdol)ను రూపొందించారు. దీనికి ఐడోల్(Aidol)గా నామకరణం చేశారు. మాస్కోలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా వేదికపై ప్రదర్శించారు. అయితే అది వేదికపైకి రాగానే తప్పటడుగులు వేస్తూనే ప్రేక్షకులకు అభివాదం చేసింది. ఆ తర్వాత కొద్ధి క్షణాల్లోనే ముందుకు కుప్పకూలిపోయింది.
తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రోబో ఈ రకంగా వేదికపైనే కుప్పకూలిపోవడంతో శాస్త్రవేత్తలతో పాటు ఆ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు సైతం విస్మయానికి గురయ్యారు. వెంటనే నిర్వాహకులు రోబోట్ డెబ్యూ కార్యక్రమాన్ని రద్దు చేసి.. రోబోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. హ్యూమనాయిడ్ అభివృద్ధిలో వేగవంతమైన ప్రోటో టైపింగ్ ప్రమాదాలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందంటున్నారు నిపుణులు. రోబోట్ పడిపోవడానికి వేదిక పై అమర్చిన లైటింగ్, సంగీత శబ్ధాలు కారణమని భావిస్తున్నారు.
A presentation of Aidol, a new first russian anthropomorphic robot with AI.
Walked on stage to Rocky soundtrack.
Didn’t survive round one. pic.twitter.com/0Dtm6YQeo5
— Dmitry Buenkov (@dibuenio) November 11, 2025
