దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత ప్రఖ్యాత ఎయిర్ ఫైటర్ జెట్ దుబాయ్ లో కుప్పకూలింది. దుబాయ్ ఎయిర్ షో లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ప్రదర్శన నిర్వహిస్తున్న వేళ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ విమానం అకస్మాత్తుగా నేలకొరిగింది. దీంతో మంటలు చెలరేగి తేజస్ యుద్ధ విమానం పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కాగా, ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు.
BREAKING: An Indian Tejas fighter jet crashed during an aerial display at the Dubai Air Show. pic.twitter.com/YH18ExmCly
— LIMON (@limondar0) November 21, 2025
