న్యూఢిల్లీ : థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్-2025 (Miss Universe 2025) పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ (Miss Mexico Fatima Bosch) విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్.. ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు.
ఇక తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ నిలిచారు. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన మణికా విశ్వకర్మ భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. ఆమె కిరీటం వేటలో విఫలమయ్యారు. మణిక టాప్ 12లో నిలవలేకపోవడంతో ఈ ఏడాది భారత్ అందాల కిరీటం పోటీలో నిలవలేకపోయింది. ఈ పోటీలలో మణిక…స్విమ్‌సూట్ రౌండ్‌తో టాప్ 30 వరకు చేరుకుంది. మణికకు నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
