Longest Name In The World : అతిపెద్ద పేరుతో గిన్నిస్ రికార్డ్ ఆయన సొంతం!

న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ వాట్కిన్స్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద పేరు (2,253 పదాలు) ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ దక్కింది. 1990లో న్యాయస్థానం ద్వారా తన పేరును పొడిగించుకోవడానికి ఆయన అనుమతి పొందారు.

Longest Name In The World

విధాత : ప్రతి మనిషికి తన పేరుతో తనకు గుర్తింపు రావాలన్న ఆశ ఉంటుంది. ఇందుకోసం జీవితంలో తమతమ వృత్తులలో రాణించడం ద్వారనో..లేక ప్రత్యేకమైన పనులతోనో గుర్తింపు కోసం శ్రమిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తనకున్న అతిపెద్ద పేరుతోనే ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించాడు. లారెన్స్ వాట్ కిన్స్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత పెద్ద పేరు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సాధించాడు. న్యూజిలాండ్ కు చెందిన లారెన్స్ వాట్ కిన్స్ 2,253 పదాలతో అతి పొడవైన పేరు పెట్టుకున్నాడు. 1965లో జన్మించిన వాట్ కిన్స్ తన పేరును 2 వేల కంటే ఎక్కువ పదాలకు పెంచుకోవాలని 1990లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణ అనంతరం జిల్లా కోర్టు దానికి అనుమతించింది. అయితే, విచారణ సమయంలో రిజిస్ట్రార్‌ జనరల్‌ దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత లారెన్స్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయగా.. విచారణ అనంతరం ఆయనకు మద్దతుగా తీర్పు వెలువడింది. దీంతో వాట్ కిన్స్ ఏకంగా 2,253 పదాలతో పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు తన పొడవైన పేరుతో ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించేశాడు.

ప్రపంచంలోనే అతి పొడవైన పేరుగల వ్యక్తిగా వాట్ కిన్స్ ను గిన్నిస్ సంస్థ గుర్తించింది. గిన్నిస్‌ రికార్డ్‌ల కోసం కొంతమంది చేసే విచిత్రమైన, అసాధారణమైన విషయాలకు తాను ఆకర్షితుడినయ్యానని వాట్ కిన్స్ తెలిపారు. ఈ క్రమంలోనే తాను పెద్ద పేరుతో రికార్డ్‌ నెలకొల్పాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అతిపెద్ద పేరుతో ప్రపంచ రికార్డు సాధించినప్పటికి తనను చాలామంది ఏ టూ జెడ్ 2000 అని పిలుస్తుంటారని, అలా పిలవడం తనకు ఎంతో నచ్చుతుందని వారెన్స్ చెప్పుకొచ్చాడు.