UPS cargo plane crash | అమెరికాలో కుప్ప‌కూలిన విమానం.. ముగ్గురు స‌జీవ ద‌హ‌నం

UPS cargo plane crash | అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. యూపీఎస్ కార్గో విమానం టేకాఫ్ స‌మ‌యంలో కుప్ప‌కూలిపోయింది. దీంతో మంట‌లు భారీ ఎత్తున చెల‌రేగాయి.

UPS cargo plane crash | అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. యూపీఎస్ కార్గో విమానం టేకాఫ్ స‌మ‌యంలో కుప్ప‌కూలిపోయింది. దీంతో మంట‌లు భారీ ఎత్తున చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు స‌జీవ ద‌హ‌నం కాగా, మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు.

యూపీఎస్ ఫ్లైట్ నంబ‌ర్ 2976 విమానం హోనులులుకు మంగ‌ళ‌వారం సాయంత్రం 5.15 గంట‌ల‌కు(అమెరికా కాల‌మానం ప్రకారం) బ‌య‌ల్దేర‌గా ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ను అమెరికా ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ అధికారికంగా ధృవీక‌రించింది.

విమానం గాల్లోకి ఎగురుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగి కుప్ప‌కూలిపోయింద‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌మాదానికి గురైన విమానం మెక్‌డోనెల్ డ‌గ్ల‌స్ ఎండీ-11 ర‌కానికి చెందిన‌ది అని అధికారులు పేర్కొన్నారు.