Espionage | అమెరికా ప్రభుత్వం తన ప్రభుత్వ సిబ్బంది, దౌత్యవేత్తలు, భద్రతా అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు, వారి కుటుంబ సభ్యులపై కొత్త ఆంక్షలు విధించింది. చైనా ప్రభుత్వ ఉద్యోగులతో గానీ, సాధారణ చైనా పౌరులతో గానీ శృంగార సంబంధాలు పెట్టుకోకూడదని ఆదేశించింది. ఈ సమాచారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గూఢచర్యం భయాల కారణంగా అమెరికా ఈ ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు. చైనాలోని ప్రభుత్వ సిబ్బంది లేక చైనా పౌరులతో ఎటువంటి లైంగిక సంబంధాలు పెట్టుకోరాదనేది ఆ ఆదేశాల సారాంశం. ఈ ఆదేశాలు దౌత్యవేత్తలకు, వారి కుటుంబ సభ్యులకు, భద్రతా అనుమతులు పొందిన కాంట్రాక్టర్లకు వర్తిస్తాయని గురువారం ఏఎఫ్‌పీ పేర్కొంది. అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ గత జనవరిలో అమెరికా వెళ్లిపోతూ ఈ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. వాణిజ్య సాంకేతిక రంగాల్లోనూ, అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
Espionage | చైనా సిబ్బందితో శృంగారంపై అమెరికా ఆంక్షలు.. ఇదీ కారణం!
