వాళ్లిద్దరు భార్యభర్తలు. అయితే భార్య ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన మహిళల్లో ఒకరైతే..భర్త ఆమెలో సగంగా కనిపిస్తు వింతైన దంపతులుగా రికార్డు సాధించారు. బ్రెజిల్ అత్యంత పొడవైన మహిళ, మాజీ మోడల్ ఎలిసాని డా క్రజ్ సిల్వా ఎత్తు 2.06 మీటర్లు. తన భర్త ఫ్రాన్సినాల్డో డా సిల్వా కార్వాల్హో ఎత్తు 1.62 మీటర్ల ఎత్తు. వారి మధ్య ఉన్న 44 సెం.మీ ఎత్తు వ్యత్యాసం నెలకొంది. వారిద్దరిని పక్కపక్కగా చూస్తే వారి మధ్య ఎంత తేడానో అన్నట్లుగా కనిపిస్తుంటారు. అయితే వారి దాంపత్య జీవనం మాత్రం అన్యోన్యమైనదని స్థానికులు చెబుతుంటారు. తాజాగా సిల్వా దంపతులు ఓ బీచ్‌లో నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిన్నతనంలో వచ్చిన కణితి వల్ల అధికంగా ఉత్పత్తి అయ్యే గ్రోత్ హార్మోన్ కారణంగా ఏర్పడిన పిట్యూటరీ గిగాంటిజం అనే డిసీజ్ తో ఎలిసాని డా క్రజ్ సిల్వా అధిక ఎత్తు పెరిగింది. ఈ అనూహ్య ఎత్తు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టడమే కాదు.. ఆమెకు 2 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో కూడిన ప్రజాదరణను అందించింది. సిల్వా దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. వారి సంబంధం శారీరకమైన సంబంధాలకు అతీతమైన మానసికమైన ప్రేమానురాగాలతో కూడిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Chewing Gum | మీరు చూయింగ్ గమ్ తింటున్నారా..? అయితే నపుంసకులుగా మారే ఛాన్స్..!
వామ్మో ‘ఘోస్ట్ సైకిల్’…చూస్తే షాకింగ్ !
