Unique Traditions | వింత‌లందు ఈ వింత‌లు వేరయా..! చూస్తే ఆశ్చ‌ర్య‌పోయి.. అద‌రాల్సిందే..!

Unique Traditions | ప్ర‌తి దేశానికి, ఆ దేశంలో ఉండే తెగ‌ల‌కు, జాతుల‌కు ప్ర‌త్యేక సంస్కృతి సంప్ర‌దాయాలు ఉంటాయి. వారు అవే సంప్ర‌దాయాల‌ను గ‌త కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి అనుస‌రిస్తున్నారు. కొన్ని దేశాల్లోని కొన్ని తెగ‌ల సంప్ర‌దాయాల‌ను చూస్తే.. ఆశ్చ‌ర్య‌పోయి అదిరిపోవాల్సిందే.

Unique Traditions | వింత‌లందు ఈ వింత‌లు వేరయా..! చూస్తే ఆశ్చ‌ర్య‌పోయి.. అద‌రాల్సిందే..!

Unique Traditions | ప్ర‌తి దేశానికి, ఆ దేశంలో ఉండే తెగ‌ల‌కు, జాతుల‌కు ప్ర‌త్యేక సంస్కృతి సంప్ర‌దాయాలు ఉంటాయి. వారు అవే సంప్ర‌దాయాల‌ను గ‌త కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి అనుస‌రిస్తున్నారు. కొన్ని దేశాల్లోని కొన్ని తెగ‌ల సంప్ర‌దాయాల‌ను చూస్తే.. ఆశ్చ‌ర్య‌పోయి అదిరిపోవాల్సిందే. కొన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచే సంప్ర‌దాయాలు ఉండ‌గా, మ‌రికొన్ని భ‌యాన‌కమైన సంప్ర‌దాయాలు ఉన్నాయి. ఆయా దేశాల్లోని కొన్ని తెగ‌ల సంప్ర‌దాయాల‌ను చూసేద్దాం..

డెన్మార్క్.. (Denmark )

మీరు 25 ఏళ్ల వ‌ర‌కు కూడా ఒంట‌రిగా జీవిస్తున్నారా..? అయితే మిమ్మ‌ల్ని ఓ కుర్చీపై కూర్చోబెట్టి.. త‌ల‌పై దాల్చిన చెక్క పొడిని కుమ్మ‌రిస్తారు. ఇది మ‌న ఇండియాలో అయితే కాదు.. కేవ‌లం డెన్మార్క్‌లోనే ఈ సంప్ర‌దాయం ఉంది.

ప‌పువా న్యూ గినియా ( Papua New Guinea )

మ‌న దేశంలో భర్త చ‌నిపోతే భార్య వితంతువుగా మారిపోతోంది. ఆమె మంగళసూత్రం తొలగించి, గాజులు పగలకొట్టి, నుదిటి మీద తిలకం చెరిపేసి.. అప్పటికే పుట్టెడు బాధలో ఉండే స్త్రీ మూర్తికి మరింత శోకం అందిస్తుంటారు. అదే ప‌పువా న్యూ గినియాలో మాత్రం అలా జ‌ర‌గ‌దు. కేవ‌లం త‌మ చేతి వేళ్ల‌ను క‌త్తిరించుకుని భ‌ర్త‌ల‌కు సంతాపం ప్ర‌క‌టిస్తుంటారు. ఇదే వంద‌ల ఏళ్ల నుంచి కొన‌సాగుతున్న ఆన‌వాయితీ అని స్థానికులు చెబుతున్నారు.

స్కాట్లాండ్ ( Scotland – Blackening )

మ‌న ద‌గ్గ‌ర పెళ్లిళ్లకు వ‌ధూవ‌రుల‌కు ప‌సుపు రాసి.. మంగ‌ళ‌స్నానాలు చేయిస్తారు. పెళ్లి వేడుక‌లో ఇదొక ఘ‌ట్టం. అదే స్కాట్లాండ్‌లో అయితే మ‌నం ఊహించ‌ని సంప్ర‌దాయం ఉంది. వారు పెళ్లి వేడుక‌లో ఈ ఘ‌టాన్ని న‌ల్ల‌బ‌డ‌టం అని పిలుస్తారు. అంటే వ‌ధూవ‌రుల‌ను కుళ్లిన ఆహార ప‌దార్థాలు, బూడిద‌తో క‌ప్పేస్తారు. అంటే వారు పెళ్లి అనే పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని సంకేత‌మ‌ట‌.

ఇండోనేషియా – Indonesia (Toraja People)

ఇండియాలో ఎవ‌రైనా చ‌నిపోతే ఖ‌న‌నం చేస్తారు. ఇక చ‌నిపోయిన ఏడాదికి స‌మాధిని అలంక‌రించి.. ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. కానీ అదే ఇండోనేషియాలో అయితే.. ఏడాది త‌ర్వాత డెడ్‌బాడీని మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీస్తారు. ఆ మృత‌దేమానికి నీట్‌గా దుస్తులు వేయిస్తారు. అనంత‌రం ఇష్ట‌మైన వారు ఆ డెడ్‌బాడీని మోసుకెళ్లి త‌మ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తార‌ట‌.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ – India (Ramnami Tribe, Chhattisgarh)

ఇది మ‌న దేశంలోని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌.. ఇక్క‌డ రామ భ‌క్తులు గొప్ప భ‌క్తిని చాటుకుంటున్నారు. త‌మ భ‌క్తికి చిరునామాగా త‌మ శ‌రీరాల‌పై భ‌క్తులు లార్డ్ రామ అని టాటూలు వేయించుకుంటున్నారు. ఈ ఆచారాన్ని వందేండ్ల‌కు పైగా కొన‌సాగిస్తున్నార‌ట‌.

థాయిలాండ్ ( Thailand Phuket Vegetarian Festival ) 

థాయిలాండ్‌లోని ఫుకెట్ వెజిటేరియ‌న్ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా.. ఓ తెగ‌కు చెందిన వారు భ‌యాన‌క స్టంట్ల‌కు పాల్ప‌డుతారు. త‌మ విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు, త‌మ‌ను తాము శుద్ధి చేసుకునేందుకు.. మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో వినూత్న కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. ఒళ్లు గ‌గుర్పాటు అయ్యే విధంగా.. త‌మ బుగ్గ‌లు, నాలుక‌లు, శ‌రీరంపై ప‌దునైన వ‌స్తువుల‌ను గుచ్చుకుంటారు.

బ్రెజిల్ ( Brazil )

బ్రెజిల్‌లో పాటించే ఈ సంప్ర‌దాయం మ‌రి క‌ఠిన‌మైన ప‌రీక్ష అని చెప్పొచ్చు. ఎందుకంటే.. యువ‌కులు త‌మ బ‌లాన్ని, లైంగిక సామ‌ర్థ్యాన్ని నిరూపించుకోవ‌డానికి.. చీమ‌ల‌తో కూడిన ఓ సంచిలో చేయి పెట్టాలి. అవి క‌రిచిన‌ప్ప‌టికీ.. త‌న శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను నిరూపించుకోవాలి.

ఆఫ్రికా (Lip Plates in Africa )

ముర్సి, చాయ్, సూరి, తిర్మా వంటి తెగల‌కు చెందిన‌ మహిళలు తమ కింది పెదవులపై పెద్ద మట్టి లేదా చెక్క పలకలను ధరిస్తారు. బయటివారికి ఇది శరీరానికి హాని కలిగించేదిగా అనిపించినప్పటికీ, వారి సంస్కృతిలో ఇది స్త్రీత్వం, అందానికి చిహ్నం అని పేర్కొంటున్నారు.