Monsoon 2025 : బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఏపీ(AP) , తెలంగాణ(Telangana)లో రెండు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rainfall)కొనసాగనున్నాయని వాతావారణ శాఖ(Weather Alert), వెల్లడించింది. ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు పడుతాయని..అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్షాలు, ఉత్తర,దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్(Flash Flood Alert)అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు
సంభవించే అవకాశముందని హెచ్చరించింది. తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేసింది.