అమరావతి : ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో సీనీ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తలపెట్టిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాని(Basavatarakam Cancer Hospital)కి బుధవారం ఆయన భూమి పూజ(Bhoomi Pooja) చేశారు. తుళ్లూరు-అనంతవరం గ్రామల మధ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బసవతారకం ఆసుపత్రి, క్యాంపస్ నిర్మాణం జరుపుకోనుంది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సీఆర్డీఏ 21ఎకరాల భూమిని కేటాయించింది. ఆసుపత్రి నిర్మాణానికి సంస్థ చైర్మన్ బాలకృష్ణ భూమి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యే, ట్రస్టు సభ్యులు హాజరయ్యారు.
ఈ ఆసుపత్రిలో తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూరుస్తారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌తో ఏర్పాటుచేసి.. 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు. రెండో దశలో ఆసుపత్రి స్థాయిని పడకల స్థాయి వెయ్యికి పెంచుతారు. ప్రత్యేక విభాగాలు, పరిశోధన విభాగాల ఏర్పాటు, క్లిష్టమైన, అధునాతన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా దీనిని తీర్చిదిద్దుబోతున్నారు.