Bigg Boss8|ఏంటి.. బిగ్ బాస్‌8లో ఆ పాత కంటెస్టెంట్స్ మ‌ళ్లీ సంద‌డి చేయ‌బోతున్నారా..!

Bigg Boss8| బిగ్ బాస్ కార్య‌క్ర‌మంపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన కూడా ఆ షో మాత్రం అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతుంది. తెలుగులో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. ఏడు సీజ‌న్స్‌లో సీజ‌న్ 6 మాత్రం కాస్త నెగెటివిటీని తెచ్చుకుంది. దాంతో ఉల్టా పుల్టా అంటూ సీజ‌న్ 7ని స‌రికొత్త‌గా ప్ర‌జెంట్

  • Publish Date - April 17, 2024 / 05:52 PM IST

Bigg Boss8| బిగ్ బాస్ కార్య‌క్ర‌మంపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన కూడా ఆ షో మాత్రం అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతుంది. తెలుగులో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. ఏడు సీజ‌న్స్‌లో సీజ‌న్ 6 మాత్రం కాస్త నెగెటివిటీని తెచ్చుకుంది. దాంతో ఉల్టా పుల్టా అంటూ సీజ‌న్ 7ని స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేశారు. అయితే సీజ‌న్ 7కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సీజ‌న్ 8ని ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా మ‌రికొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ మొదలైందని ఈ సారి చాలా పాపులారిటీ ఉన్న ఆర్టిస్ట్‌ల‌ని తీసుకురాబోతున్న‌ట్టు స‌మాచారం. జనాల్లో క్రేజ్ ఉన్న ప్రముఖులను కంటెస్టెంట్స్ గా తీసుకొస్తే షో మ‌రింత హిట్ అవుతుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌.

ఇటీవ‌ల బిగ్ బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్‌కి సంబంధించి ఓ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టింది. కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్ట్ చేస్తాడనే టాక్ న‌డిచింది. దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. అవకాశం వారు ఇవ్వొచ్చేమో కాని నాకు అయితే మాత్రం క‌చ్చితంగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాలనే గట్టి లక్ష్యం లేద‌ని తెలియ‌జేశాడు. ఒక‌వేళ గ‌ట్టిగా ఆఫ‌ర్ చేస్తే మనోడు హౌజ్‌లో అడుగుపెట్టిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. మ‌రోవైపు సీజ‌న్8లో పాత కంటెస్టెంట్స్ కూడా అడుగుపెట్ట‌బోతున్నారు అనే టాక్ కూడా న‌డిచింది. ప్రేక్షకాదరణ పొందిన కంటెస్టెంట్స్ లో ఒక ముగ్గురిని తీసుకుంటారని అంటున్నారు.ఆ ముగ్గురు శివాజీ, ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌, అమ‌ర్ దీప్ అనే టాక్స్ వినిపిస్తున్నాయి.

సీజ‌న్ 7లో ఈ ముగ్గురి మీదే షో అంత న‌డిచింది. అమ‌ర్ దీప్.. శోభా, ప్రియాంక‌తో స్నేహంగా ఉంటూ వారితో ఒక బ్యాచ్ ఏర్పాటుచేసి ఎంత ర‌చ్చ చేశాడో మ‌నం చూశాం. అమ‌ర్ దీప్‌తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. మ‌రి అమ‌ర్ దీప్ ఇటీవ‌ల ఓ మూవీకి కూడా క‌మిట్ కాగా, ఆయ‌న నిజంగా బిగ్ బాస్ సీజ‌న్‌8లోకి తిరిగి వ‌స్తాడా అంటే కాస్త అనుమానంగానే ఉంది. ఇది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే అని అంటున్నారు. మ‌రోవైపు శివాజీ కూడా ప‌లు ప్రాజెక్ట్స్‌కి క‌మిటైన‌ట్టు స‌మాచారం. సో క‌మిటైన ప్రాజెక్ట్స్ ప‌క్క‌న పెట్టి తిరిగి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే అవ‌కాశం చాలా త‌క్కువ అని అంటున్నారు

Latest News