విధాత: కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణ అవకతవకల(Corruption)పై విచారణకు సంబంధించి జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్(PC Ghose Commission) ఈ రోజు ప్రభుత్వానికి తన నివేదిక(Final Report Submission )ను అందించనున్నారు. బీఆర్కే భవన్ లోని కమిషన్ కార్యాలయంలో నీటి పారదల శాఖ ముఖ్య కార్యదర్శికి సీల్డ్ కవర్ లో జస్టిస్ పీసీ.ఘోష్ తన నివేదిక అందచేస్తారు. నివేదికను అందించని తర్వాత పీసీ. ఘోష్ కోల్ కత్తాకు వెళ్లిపోనున్నారు. 2023ఆక్టోబర్ లో మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా..అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి విచారణకు 2024మార్చి 14 జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ ను నియమించింది. 15నెలల పాటు సుదీర్ఘకాలంగా 119 మంది అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రజాసంఘాల నాయకులను విచారించిన కమిషన్ కాగ్ , ఎన్డీఎస్ఎ , విజిలెన్స్ నివేదికలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. మాజీ మంత్రులు ఈటల రాజేందర్‌ను గత నెల 6, హరీష్ రావున అదే నెల 9న మాజీ మంత్రి హరీశ్‌ను, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించింది. విచారణ పూర్తి కావడంతో నివేదిక సమర్పించబోతున్నారు.
ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికలో ఏముండబోతుంది..బ్యారేజీలలో లోపాలకు కారకులు ఎవరు..వాటి నిర్మాణ స్థలాల మార్పుకు కారకులు ఎవరు..కారణాలు ఏమిటి..బ్యారేజీల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం ఉందా..అక్రమాలకు బాధ్యులైన వారిపై తీసుకోవాల్సిన చర్చలకు సిఫారసులు వంటి అంశాలు జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నివేదికపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. కమిషన్ నివేదిక సమర్పించడానికి ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుండగా.. ప్రొటోకాల్ వంటి ప్రక్రియల కోసం ఆగస్టు 3 దాకా గడువు పెంచారు.