ఓటీటీ (OTT) ప్రేక్షకులను అలరించేందుకు మలయాళం నుంచి ఓ యాక్షన్ థ్రిల్లర్ వచ్చేసింది. గడిచిన దీపావళికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన నటుడు జోజు జార్జ్ (Joju George) కి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా పేరు ఫని (Pani). మన తెలుగమ్మాయి అభినయ (Abhaya Hiranmay) కీలక పాత్రలో నటించింది. మలయాళంలో విడుదలైన రెండు నెలల తర్వాత తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రచార లేమితో అశించినంత విజయం దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు డిజిటల్ స్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. బైక్ మెకానిక్‌లుగా పనిచేసే ఇద్దరు కుర్రాళ్లు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఇజీ మనీ కోసం ఓ హత్య చేసి తప్పించుకుంటారు. అనంతరం ఓ వివాహితపై కన్నేసి ఓ షామింగ్ మాల్‌లో అల్లరి చేయగా భర్త (హీరో) వచ్చి ఆ యువకులను కొడతాడు. దీంతో ఆ కుర్రాళ్లు పగబట్టి ఇంటికి వెళ్లి ఆ మహిళను వేదిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద గ్యాంగ్‌స్టర్ అయిన భర్త రంగంలోకి దిగుతాడు. అయినా యువకులు ఎక్కడా తగ్గకుండా ఎదురు తిరుగుతారు.
ఈ క్రమంలో హీరో ఆ కుర్రాళ్లను పట్టుకోగలిగాడా చివరకు ఏం చేశాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. ఎక్కడా, ఎటువంటి సోధి లేకుండా స్పీడ్ స్క్రీన్‌ప్లేతో, చివరి వరకు సస్పెన్స్ తో సినిమా సాగుతుంది. ఇప్పుడీ చిత్రం సోని లీవ్ (Sony Liv) ఓటీటీ (OTT) లో మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ స్టీమింగ్ అవుతుంది. యాక్షన్, క్రైమ్ చిత్రాలు ఇష్ట పడే వారు ఈ ఫని (Pani) సినిమాను ఒకసారి వీక్షించొచ్చు.