Site icon vidhaatha

IDENTIY OTT: వామ్మో.. ఏం ట్విస్టులురా సామి! వారంలోనే ఓటీటీకి టొవినో థామ‌స్ లేటెస్ట్ మూవీ

విధాత‌: ఈ సంవ‌త్స‌రం కేర‌ళ నుంచి మొద‌టి చిత్రంగా విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ఐడెంటిటీ (Identity). టొవినో థామ‌స్ (Tovino Thomas) హీరోగా న‌టించ‌గా త్రిష (Trisha), హున‌మాన్ ఫేం విన‌య్ రాయ్ (Vinay Rai), మందిరాబేడి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అఖిల్ పాల్ (Akhil Paul), అనాస్ ఖాన్ (Anas Khan) ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ‌న‌వ‌రి2న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం సంక్రాంతి త‌ర్వాత తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు వారం గ‌డ‌వ‌క ముందే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ప్ర‌చార లోపం వ‌ళ్ల జ‌నాల‌కుఅ వించినంత‌గా చేర‌ని ఈ మూవీ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌, ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా అరించ‌డం ఖాయం.

కథ విష‌యానికి వ‌స్తే.. అమ్మాయిల వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న అత‌నిని ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చంపండంతో పాటు త‌ను ఉండే ప్రాంతాన్ని త‌గుల‌బెడ‌తాడు. కొన్ని రోజుల త‌ర్వాత క‌ర్ణాట‌క నుంచి ఓ పోలీసాఫీస‌ర్ ఈ కేసు విచార‌ణ నిమిత్తం అనా అనే యువ‌తి (త్రిష‌)తో వ‌చ్చి హ‌ర‌న్ (టోవినో) ఉండే అపార్ట్‌మెంట్‌లో దిగుతారు. అక్క‌డ అనా సాయంతో హ‌ర‌న్‌ నిందితుల స్కెచ్ గీసే క్ర‌మంలో అనేక అనుమానాలు ఏర్ప‌డుతుంటాయి. ఈ క్ర‌మంలో క‌థ చాలా కొత్త మ‌లుపులు తీసుకుంటుంది. వీడియోల వెనుక మ‌రో పెద్ద కుట్ర బ‌య‌ట‌ప‌డుతుంది. అస‌లు క‌ర్ణాట‌క నుంచి వ‌చ్చింది ఎవ‌రు. వారి వెనుక ఉన్న‌ క‌థేంటి అనే అనేక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల నేప‌థ్యంలో సినిమా చివ‌రి వ‌ర‌కు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.

ఈ సినిమా చూసిన వారంతా అస‌లు ఇలాంటి సినిమా థియేట‌ర్‌లో ఎందుకు చూడ‌లేదు అని, అస‌లెలా మిస్స‌యామ‌నే భివ‌న రావ‌డం గ్యారంటీ. స‌డ‌న్‌గా ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి జీ5 (Zee5) ఓటీటీ OTTలో స్ట్రీమింగ్‌కువ‌చ్చిన ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిస్స‌వ‌కండి. మూవీలోని ప్ర‌తీ సీన్ మీకూ చివ‌రి వ‌ర‌కు సూప‌ర్ థ్రిల్ ఇవ్వ‌కుండా ఉండ‌దు అంటే అతిశ‌యోక్తి కాదు. సినిమాలో స‌మ‌యం గ‌డుస్తున్న కొద్ది కొత్త విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం, దాని వెన‌కాల స్టోరీ, ట్విస్టులు గూస్‌బ‌మ్స్ తెచ్చేలా ఉంటాయి. ఎక్క‌డా ఎలాంటి అబ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు లేవు కుటుంబంతో క‌లిసి ఐడెంటిటీ (Identity) చూసేయ‌వ‌చ్చు. డోంట్ మిస్‌.

Exit mobile version