బీజాపూర్ :
ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులకు మావోయిస్టుల జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. బీజూపూర్ లోని అన్నారం, మర్రిమల్ అడవుల్లో ఇరువైపుల వరుస కాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులను జవాన్లు హతమార్చారు. ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. కాగా, కాల్పుల్లో ఎంతమంతి నక్సల్స్ మరణించారన్న విషయంపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
