అమరావతి: భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్(Mithali Raj), రావి కల్పనల(Ravi Kalpana)కు అరుదైన గౌరవం దక్కింది. ఏపీ ప్రభుత్వం విశాఖ స్టేడియం గ్యాలరీ స్టాండ్ కు మిథాలీ రాజ్ పేరును నామకరణం చేసింది. అలాగే విశాఖ స్టేడియం మూడో గేట్ కు రావి కల్పన పేరును పెట్టింది. ఐసీసీIC చైర్మన్ జైషా(Jai Shsa), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) లు ఆదివారం విశాఖ స్టేడియంలో వారి పేర్లను అధికారికంగా లాంచ్ చేశారు. భారత్–ఆస్ట్రేలియా మహిళల ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా మిథాలీరాజ్, కల్పనల పేరుతో స్టాండ్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
గత ఆగస్టులో ‘బ్రేకింగ్ బౌండరీస్’ కార్యక్రమానికి హాజరైన టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందనా ఏపీ మంత్రి నారా లోకేష్‌కు చేసిన ప్రతిపాదన మేరకు విశాఖ స్టేడియంలో స్టాండ్లకు మిధాలీ, కల్పన పేర్లు పెట్టాలని నిర్ణయించారు. స్మృతి మందనా ప్రతిపాదనకు వెంటనే స్పందించిన లోకేష్.. ఏసీఏతో చర్చించి.. మిథాలీ రాజ్, రావి కల్పన స్టాండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు మాజీ క్రికెటర్ల పేరిట స్టాండ్స్, పెవిలియన్స్ ఉన్నాయి.
భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 23 ఏళ్ల కెరీర్‌లో.. వన్డే క్రికెట్‌లో మొత్తం 232 వన్డేల్లో 7,805 పరుగులు సాధించింది. సగటు 50.68 గా ఉంది. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. 89 టీ-20ల్లో 2,364 రన్స్ చేసింది. సగటు 37.52 కాగా.. 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 12 టెస్టుల్లో 43.68 సగటుతో 699 పరుగులు చేసింది. ఇక్కడ ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. ఏకంగా 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు 2022లో గుడ్‌బై చెప్పింది.
రావి కల్పన ఆంధ్రకు చెందిన వికెట్ కీపర్–బ్యాటర్‌గా 2015-16 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. భారత్ తరుఫున 7 వన్డేలు ఆడింది.