President Droupadi Murmu| ల్యాండింగ్ వేళ కుంగిన రాష్ట్రపతి హెలికాప్టర్ హెలిప్యాడ్

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ ఓ వైపు భూమిలోకి ఒరిగింది.

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్(Helicopter landing incident) సమయంలో కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ ఓ వైపు భూమిలోకి ఒరిగింది. కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ప్రసిద్ధ శబరిమల ఆలయ దర్శనానికి వెళ్లారు. అమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్(Kochi helipad)లో ల్యాండింగ్‌ తర్వాత ఓ వైపు కూరుకుపోయింది.

వెంటనే పోలీస్‌, అగ్నిమాపకశాఖ సిబ్బంది హెలికాప్టర్ నెట్టి పక్కకు చేర్చారు. రాష్ట్రపతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా సిబ్బంది ఎవరికి ఏమి కాలేదని భద్రతాధికారులు వెల్లడించారు.