Site icon vidhaatha

Shibu Soren| మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత

న్యూఢిల్లీ: ఝార్ఖండ్( Jharkhand) మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister) శిబూసోరెన్(Shibu Soren – 81) కన్నుమూశారు(Passes-Away). కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న శిబూసోరెన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రితో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఝార్ఖండ్‌ నుంచి శిబు సోరెన్‌ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శిబూసోరెన్ ఝర్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha)ను స్థాపించి ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని సాగించి రాష్ర్ట సాధనకలో కీలక భూమిక వహించారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం మూడుసార్లు ఆ రాష్ట్ర సీఎంగా పనిచేశారు.

దుమ్కా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. యూపీఏ హయాంలో మూడుసార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు.అటు 2004నుంచి 2006వరకు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. శిబూసోరెన్ కుమారుడు హేమంత్ర సోరెన్ ఝార్ఖండ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు .

Exit mobile version