Site icon vidhaatha

Urea Shortage| యూరియా కొరతపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల ధర్నా

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు అవసరమైన యూరియా(Urea shortage)ను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వా(Sentral government)న్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ(Telangana Congress MPs)లు మంగళవారం పార్లమెంటు ఆవరణలో ధర్నా నిర్వహించారు. నినాదాలు..బ్యానర్లతో ధర్నా నిర్వహించగా…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ వివక్షతతో తెలంగాణకు నిర్దేశించిన కోటా యూరియా సరఫరా చేయకుండా రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తుందని వారు ఆరోపించారు. వెంటనే కేంద్రం తెలంగాణ రైతాంగం డిమాండ్ మేరకు యూరియా కోటా సరఫరా చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సోమవారం కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు యూరియా సమస్యపై తమ నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్డాను కలిసి, యూరియా కోటాను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేంద్రం తెలంగాణకు 8 లక్షల టన్నుల యూరియా ఇస్తామని చెప్పి, కేవలం 5 లక్షల 32 వేల టన్నులు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఇంకా సుమారు 3 లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని, ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version