విధాత : తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో గ్రామ పంచాయతీ(Telangana Panchayat Elections) ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. పల్లె పోరులో సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో గెలుపు గుర్రాలను సర్పంచ్ అభ్యర్థులుగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్లకు తగ్గట్లుగా అవసరమైన అభ్యర్థులు దొరుకక తంటాలు పడుతున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీం చేసుకుంటున్నారు. గ్రామాభివృద్ధికి బలమైన హామీలిస్తున్న అభ్యర్థులను పోటీ లేకుండా ఏకగ్రీవం చేస్తున్నారు. సర్పంచ్ పదవి అంటేనే అప్పుల పాలవ్వడం అంటూ గత సర్పంచ్ లు హెచ్చరిస్తున్నప్పటికి గ్రామాల్లో తమ పరపతి కోసం తగ్గేదేలే అంటూ అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో పోటాపోటీగా తలపడుతున్నారు.
ఇది ఇలా ఉండగా..ఓ గ్రామంలో సర్పంచ్(Sarpanch election) పదవి కోసం ఏకంగా అమెరికా(USA) నుంచి వచ్చి నామినేషన్ వేసిన ఘటన ఆసక్తి కరంగా మారింది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool)జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి(Lattupalli Village) గ్రామానికి చెందిన కమతం నందిని(Kamatam Nandini) అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో(Sarpanch nomination) నామినేషన్ వేశారు. నందిని, శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. వాళ్లు అమెరికాలో స్థిరపడటంతో ఆరేళ్ల క్రితం నందిని ఆదేశానికి వెలుతూ వస్తున్నారు. కొన్ని నెలల క్రితం కూతురు డెలివరి కోసం అమెరికా వెళ్లారు.
పంచాయతీ ఎన్నికల్లో లట్టుపల్లి గ్రామం సర్పంచ్ పదవి 40ఏళ్ల తర్వాత జనరల్ మహిళ రిజర్వేషన్ వచ్చిందని, అటు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో పోటీకి అవకాశం దక్కిందని నందిత తెలిపారు. దీంతో అమెరికా నుంచి లట్టుపల్లి గ్రామానికి వచ్చి సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగిందని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నది మా ఆశ అని, ప్రజలు నన్ను గెలిపించాలని కోరారు.
