Site icon vidhaatha

Ganesh festival dance| వినాయక చవితి మండపాల వద్ద అశ్లీల నృత్యాలు!

అమరావతి: భక్తితో జరుపుకోవాల్సిన వినాయక నవరాత్రి( Vinayaka Chavithi) ఉత్సవాల్లో అశ్లీల నృత్యాల(obscene dance)పైత్యం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డూరు(Palamaner Vadduru)లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అశ్లీల నృత్యాలు చేయడం విమర్శలకు దారి తీసింది. రికార్డింగ్ డాన్సింగ్ బృందం మహిళలను నగ్నంగా డ్యాన్స్ చేయాలని స్థానిక యువకులు బలవంతం చేశారు.

దీంతో వారు పలు సినిమా పాటలకు అర్థనగ్న డాన్స్ చేయడంతో స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వినాయక మండపం వద్ధ ఈ రకమైన అశ్లీల నృత్యాలు చేయడంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకులతో పాటు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Exit mobile version