విధాత, హైదరాబాద్ : లాజిస్టిక్స్ సేవల ద్వారా తెలంగాణ ఆర్టీసీకి 2022-23 ఏడాదిలో రూ.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీనిని 2023-24లో రూ.120 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గురువారం దిల్‌సుఖ్ నగర్ బస్ స్టేషన్‌లో నూతన మోడల్ లాజిస్టిక్స్ పార్సిల్ కౌంటర్‌తో పాటు కొత్త లోగో, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ రోజూ 15 వేల పార్సిల్స్ టీఎస్ఆర్టీసీ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. గంటల వ్యవధిలో డెలివరీలు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు, సేవలతో ప్రజల ముందుకు వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.