Warangal | గతంలో బంగారు గొలుసు( Gold Chain ).. ఇప్పుడేమో బంగారు ఉంగరం( Gold Ring ) పోగొట్టుకుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య( Suicide ) చేసుకుంది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా( Warangal Dist )లోని దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది.
గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హేమలతా రెడ్డి(19) హనుమకొండ( Hanumakonda )లోని ఓ ప్రయివేటు కాలేజీలో బీకాం సెకండియర్ చదువుతోంది. రెండో కుమార్తె ఆశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాల( Residential School )లో ఎనిమిదో తరగతి చదువుతుంది.
అయితే ఇద్దరు కుమార్తెలు ఉగాది పండుగకు ఇంటికొచ్చారు. గత బుధవారం హేమలతా రెడ్డి చేతికున్న పావు తులం బంగారం ఉంగరం పోయింది. ఎంత వెతికినా ఉంగరం కనిపించలేదు. ఆరు నెలల కిందట కూడా హేమలతా రెడ్డి గోల్డ్ చైన్ పోగొట్టుకుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హేమలతా.. మంగళవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది.
సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చిన తండ్రి.. కూతురు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సారీ డాడీ.. నాకు భయమేస్తోంది అంటూ సూసైడ్ నోట్‌లో హేమలతా రెడ్డి రాసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.