Adilabad | త‌ల్లి కన్నుమూత‌.. ప‌సిపాప ఆక‌లి తీర్చేందుకు.. పాల కోసం 10 కి.మీ. ప్ర‌యాణం

Adilabad | ఓ త‌ల్లి త‌న బిడ్డను ప్ర‌స‌వించిన 10 రోజుల‌కే చ‌నిపోయింది. దీంతో ప‌సిపాప ఆక‌లి తీర్చేందుకు కుటుంబ స‌భ్యులు పాల కోసం ప్ర‌తి రోజు 10 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌స్తుంది. గ‌త రెండు నెల‌ల నుంచి ఆ కుటుంబ స‌భ్యులు ఈ క‌ష్టాలు ప‌డుతూనే ఉన్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా (Adilabad Dist)లోని ఇంద్ర‌వెల్లి (Indravelli) మండ‌లానికి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఓ గిరిజ‌న గూడెం ఉంది. గిరిజ‌న గూడెం రాజుగూడ‌ (Rajuguda)లో […]

  • Publish Date - March 23, 2023 / 02:41 AM IST

Adilabad |

ఓ త‌ల్లి త‌న బిడ్డను ప్ర‌స‌వించిన 10 రోజుల‌కే చ‌నిపోయింది. దీంతో ప‌సిపాప ఆక‌లి తీర్చేందుకు కుటుంబ స‌భ్యులు పాల కోసం ప్ర‌తి రోజు 10 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌స్తుంది. గ‌త రెండు నెల‌ల నుంచి ఆ కుటుంబ స‌భ్యులు ఈ క‌ష్టాలు ప‌డుతూనే ఉన్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా (Adilabad Dist)లోని ఇంద్ర‌వెల్లి (Indravelli) మండ‌లానికి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఓ గిరిజ‌న గూడెం ఉంది. గిరిజ‌న గూడెం రాజుగూడ‌ (Rajuguda)లో కేవ‌లం ఆరు ఆదివాసీ కుటుంబాలు మాత్ర‌మే నివ‌సిస్తాయి. ఈ గూడెం వాసులు (Tribals) త‌మ నిత్యావ‌స‌రాల‌కు ఇంద్ర‌వెల్లి మండ‌ల కేంద్రానికి వెళ్లాల్సిందే.

అయితే గూడెంకు చెందిన కొడ‌ప పారుబాయి(22) జ‌న‌వ‌రి 10వ తేదీన పండంటి ఆడ‌బిడ్డ‌కు ఇంద్ర‌వెల్లి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో జ‌న్మ‌నిచ్చింది. ఆ త‌ర్వాత 10 రోజుల‌కు అనారోగ్యంతో పారుబాయి చ‌నిపోయింది. దీంతో ప‌సిపాప ఆక‌లి తీర్చేందుకు కుటుంబ స‌భ్యులు ప‌డ‌రాని పాట్లు పడుతున్నారు.

తండ్రి జంగుబాబు, తాత బాపురావు.. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ప్ర‌తిరోజు రాజుగూడ నుంచి 3 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చిద్ద‌రి ఖానాపూర్ వ‌ర‌కు న‌డ‌క మార్గంలో వెళ్తున్నారు. అక్క‌డ్నుంచి 7 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇంద్ర‌వెల్లికి వాహ‌నాల్లో వెళ్తూ పాల ప్యాకెట్ తీసుకువ‌స్తున్నారు. దాంతో పాప ఆక‌లి తీర్చుతున్నారు.

Latest News