Site icon vidhaatha

Aaron Finch | అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసిస్‌ స్టార్‌ బ్యాటర్‌ అరోన్‌ పించ్‌ గుడ్‌బై..!

Aaron Finch | ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌, టీ20 కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ను తాను ఆడకపోవచ్చని అర్థమైందని, అందుకే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపాడు.

ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. చివరిసారిగా గత అక్టోబర్‌ 31న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపించాడు. 12 సంవత్సరాల కెరీర్‌లో ఫించ్‌ ఐదు టెస్టులు, 146 వన్డేలు, 103 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 278, వన్డేల్లో 5,406, టీ20ల్లో 3,120 పరుగులు సాధించాడు. తాను ఆడిన 103 టీ20 మ్యాచుల్లో 76 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు ఈ విక్టోరియా ఆటగాడు.

ఫించ్‌ నేతృత్వంలో దుబాయిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని నమోదు చేసింది. టీ20లో ఫించ్‌ కన్నా ముందు ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే అత్యధికంగా పరుగులు సాధించారు. 2018లో జింజాబ్వేపై 76 బంతుల్లో 172 పరుగులు సాధించాడు. అలాగే ఇంతకు ముందు 2013లో ఇంగ్లండ్‌పై టీ20 మ్యాచ్‌లో 156 సాధించాడు.

ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో అత్యుత్తమ వైట్‌ బాల్‌ ఆటగాళ్లలో పింఛన్‌ ఒకడని క్రికెట్‌ ఆస్ట్రేలియా చైర్మన్‌ లాచ్లాన్‌ హెండర్సన్‌ తెలిపాడు. ఫించన్‌ తన ముఖంపై చిరునవ్వు, స్ఫూర్తితో క్రికెట్‌ ఆడాడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాడన్నారు.

Exit mobile version