- మహారాష్ట్రలో పోటీ ?
Jaya Prada | విధాత: ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి కాంగ్రెస్ లో, జయసుధ బీజేపీలో చేరి హడావుడి చేస్తుండగా … ఇప్పుడు జయప్రద సైతం ఉనికిచాటుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆమె భారత రాష్ట్ర సమితి తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు కూడా సినీ గ్లామర్ ఉంటే బాగుణ్ణని కేసీఆర్ (KCR) భావన అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తనతో కాస్త సాన్నిహిత్యం ఉన్న నటుడు ప్రకాష్ రాజ్, సినీ నటి జయప్రదను బీఆర్‌ఎస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
జయప్రద పార్టీలో చేరితే ఆమెను మహారాష్ట్ర (Maharashtra) నుంచి లోక్ సభకు పోటీ చేయిస్తారని అంటున్నారు. ఆమెకు దేశవ్యాప్తంగా , ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న స్టార్ ఇమేజి, పాపులారిటీని వినియోగించుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. జయసుధ గతంలో టీడీపీలో పని చేసారు. ఎన్టీ ఆర్ ఉండగా ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా కూడా చేశారు.
ఆ తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ (UttaraPradesh) లోని రాంపూర్ నుంచి 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఆతరువాత ఆమె 2014లో ఆర్‌ఎల్‌డీ తరఫున ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ నుంచి పోటీ చేసి జయప్రద ఓడిపోయారు. తరువాత బీజేపీలో చేరి గత ఎన్నికల్లో మళ్ళీ రాంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏదైతేనేం ఆమెను తమపార్టీలో చేర్చుకుని ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.