Site icon vidhaatha

Adipurush | ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Adipurush | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఆది పురుష్‌. ఇప్పటికే విడుదల కావాల్సిన చిత్రం వాయిదాపడింది. ఈ క్రమంలో సినిమా నుంచి అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా బృందం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా, పలు సాంకేతిక కారణాలతో విడుదల వాయిదావేశారు. రామాయణం ఆధారంగా.. దర్శకుడు ఓం రౌత్‌ మైథలాజికల్‌ డ్రామాగా ఆదిపురుష్‌ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కళ్లుచెదిరేలా గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా టీజర్ గతంలోనే రిలీజ్ కాగా, దానికి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది.

కొందరు విమర్శలు గుప్పించగా.. మరికొందరు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో వీఎఫ్ఎక్స్ పనులను మరింత క్వాలిటీగా చేసేందుకు చిత్ర యూనిట్ మరికొంత సమయాన్ని తీసుకున్నది. అయితే, ఈ సినిమా నుంచి ఇటీవల ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్‌ చేస్తారనే చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సినిమా నుంచి బిగ్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ఇచ్చారు. సరికొత్త పోస్టర్‌తోపాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటున్నది.

ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫొటోకు ప్రతిరూపంగా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడికి హనుమాన్ దండం పెడుతున్న పోస్టర్‌ను ఆదిపురుష్ మూవీ టీమ్ రిలీజ్ చేసింది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నాగే కనిపించారు. ఈ పోస్టర్‌పై అభిమానుల అంచనాలు పెంచగా.. పలువురు పెద్దగా ఆశలేం లేవని విమర్శిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Exit mobile version