- ఆ ప్రతిష్టను కొట్టేసేందుకు బిజెపి చూస్తున్నది
- ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: దేశం లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర కృషి చేసిందని, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన శనివారం ఢిల్లీ నెంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై మహానగర కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కొరకు కాంగ్రెస్ అన్ని విధాల పాటు పడుతున్నదన్నారు. కానీ కానీ బిజెపి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.
మహారాష్ట్రలో విలాస్ రావు దేశముఖ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, వివిధ ప్రాజెక్టులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. అయితే బీజేపీ ఈ ప్రతిష్టను కొల్లగొట్టడానికి ఈ ప్రాజెక్టులన్నిటిని తమవిగా చెప్పుకుంటూ దేశ ప్రజలను, దేశ యువతను బీజేపీ మోసం చేస్తుందని ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కేవలం కాంగ్రెస్ ను లక్ష్యంగా పెట్టుకొని విమర్శించటం, గాంధీ కుటుంబం పై దాడి చేయడం కర్తవ్యం గా పని చేస్తున్నదన్నారు.
కానీ అసలు వాస్తవం ఏమిటంటే, 1989 నుంచి గాంధీ కుటుంబానికి చెందిన ఎవరు అధికారంలో లేరని, ఒక మంత్రి , ముఖ్యమంత్రి , ప్రధానమంత్రిగా, ఎవరు అధికారంలో లేరని ఆయన సాక్షాలతో సహా కార్యకర్తలకు అర్థం చేయించారు. నిరుద్యోగం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి తీవ్రతరమైందని అర్థమవుతున్నా కూడా నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేస్తున్నాడన్నారు. పైగా తాను దేశాన్ని సుసంపన్నం చేస్తున్నానని ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆయన విమర్శించారు. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రజలకు న్యాయం చేకూరుస్తుందని దీన్ని చిన్నచూపు చూడరాదని కార్యకర్తలకు ఆయన తెలియజేశారు.