Site icon vidhaatha

Akira Nandan | ‘బ్రో’ సినిమాకు అకీరా నందన్.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

Akira Nandan

విధాత‌: పవర్ స్టార్, సుప్రీమ్ హీరో ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ఫిల్మ్ ‘బ్రో’. మెగా ఫ్యామిలీ నుంచి మొదటిసారి మేమమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. వాస్తవానికి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, బాబాయ్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే బావుంటుందనే ఆలోచన అటు ఫ్యాన్స్‌లోనూ, ఇటు నిర్మాతల్లోనూ ఉన్నా.. అది ఎప్పటికీ వర్కవుట్ అవుతుందో తెలియదు.

కానీ.. త్రివిక్రమ్ రూపంలో ‘బ్రో’ సినిమా ద్వారా మేనమామ, మేనల్లుడి కాంబినేషన్ కుదిరింది. కథకు హైప్ పెంచుతూ త్రివిక్రమ్ మాటలు, స్కీన్‌ప్లే చక్కగా కుదిరాయి. భారీ అంచనాల మధ్య ‘బ్రో’ థియేటర్స్‌లో‌కి డీసెంట్ హిట్ దిశగా దూసుకెళుతోంది. అక్కడక్కడా కాస్త మిక్స్‌డ్ టాక్ వినబడుతున్నా.. టికెట్స్ హైక్ లేకున్నా, బెనిఫిట్ షోస్ పడకున్నా.. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా మొదటి రెండు రోజులు బాగానే రాబట్టినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Exit mobile version