Site icon vidhaatha

మ‌ళ్లీ పెరిగిన అమూల్ పాల ధ‌ర‌లు.. లీట‌ర్‌పై ఎంతంటే..?

విధాత : నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. చివ‌ర‌కు పాల ధ‌ర‌లు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా అమూల్ పాల ధ‌ర‌ల‌ను పెంచింది. అమూల్ గోల్డ్( ఫుల్ క్రీమ్ మిల్క్‌)పై రూ. 2 పెంచుతూ అమూల్ డెయిరీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు గుజ‌రాత్ కో ఆప‌రేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే ఈ పెరిగిన ధ‌ర మాత్రం గుజ‌రాత్ రాష్ట్రంలో వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

అమూల్ పాల ధ‌ర‌లు పెంచడం ఈ ఏడాది వ‌రుస‌గా ఇది మూడోసారి. అన్ని ర‌కాల పాల‌పై లీట‌ర్‌కు రూ. 2 చొప్పున పెంచుతున్న‌ట్లు ఆగ‌స్టులో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రెండు నెల‌లు గ‌డిచిన త‌ర్వాత మ‌రోసారి పాల ధ‌ర‌ల‌ను పెంచింది. అయితే ఈ సారి ధ‌ర‌ల‌ను పెంచిన త‌ర్వాత అమూల్ ప్ర‌క‌ట‌న చేసింది. గ‌తంలో ధ‌ర‌ల‌ను పెంచే ముందు ప్ర‌క‌ట‌న చేసేది. శ‌నివారం నుంచి పెంచిన ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి.

నార్త్ ఇండియాలో మ‌ద‌ర్ డెయిరీ కూడా పాల ధ‌ర‌ల‌ను పెంచింది. లీట‌ర్ ఫుల్ క్రీమ్ మిల్క్, ఆవు పాల‌పై రూ. 2 చొప్పున పెంచింది. ఈ ధ‌ర‌లు అక్టోబ‌ర్ 16 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని మ‌ద‌ర్ డెయిరీ ప్ర‌క‌టించింది.

Exit mobile version