Site icon vidhaatha

Dimple Hayathi | నాపై కేసు కొట్టివేయండి..! హైకోర్టుకెక్కిన హీరోయిన్‌ డింపుల్‌

Dimple Hayathi | టాలీవుడ్‌ బ్యూటీ డింపుల్‌ హయాతి హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల డీసీపీ రాహుల్‌ హెగ్డే, డింపుల్‌ హయాతి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. వివాదంపై హైకోర్టు ఆశ్రయిస్తూ.. తనపై ట్రాఫిక్‌ డీసీపీ తప్పుడు కేసు పెట్టారంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

నటికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజ్‌కారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టింది. దుర్భాషలాడిందంటూ డింపుల్‌పై జూబ్లీహిల్స్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకు వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి చేశారని.. ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతితో పాటు డేవిడ్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విధితమే.

Exit mobile version