Site icon vidhaatha

అవతార్.. ‘వియత్నాం కాలనీ’, అవతార్ 2.. ‘నారప్ప’

అవ‌తార్‌ని ఆట‌ప‌ట్టిస్తున్న నెటిజన్లు!

విధాత: మన వాళ్లకి కూడా క్రియేటివిటీ విషయంలో తిరిగే లేదు. చిన్న పోస్టర్‌ని చూసి ఆ మూవీ దేనికి రీమేకో దేనికి ఫ్రీమేకో చెప్పేస్తారు. తాజాగా జేమ్స్ కామెరూన్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. 13 ఏళ్ల తర్వాత జేమ్స్ కామెరూన్ దృశ్యరూపం ప్రేక్షకుల ముందుకు రావడంతో అందరి ఎక్సైటింగ్‌కి తెరపడింది. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియాలోనూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. నిడివి పరంగా మనోళ్లు విమర్శలు చేస్తున్నప్పటికీ పెట్టిన డబ్బుకి మించి గొప్ప అనుభూతినే పంచారని అర్థమవుతుంది.

ఇలాంటి సినిమాలు చేయాలంటే కాదు.. చూడాలంటే అదృష్టం ఉండాలి అంటున్నారు. వర్మ ఏమో అద్భుతం అంటాడు.. దీన్ని సినిమా అంటే నేరం అంటాడు. యువ‌నిర్మాత నాగ వంశీ మాత్రం డాక్యుమెంటరీ అంటాడు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొ అభిప్రాయం. మొత్తానికి ఈ మూవీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు అదృష్టం చేసుకున్నారని చెప్పాలి. కామెరూన్ అవతార్ త్రీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ.. ఇదంతా జేమ్స్ కామరూన్ గొప్పతనం కాక మరి ఏమిటి? అని అంతా నొక్కి వ‌క్కాణిస్తున్నారు.

అయితే తెలుగు సినీ ప్రేక్షక నెటిజన్లు కొందరు సోషల్ మీడియా వేదికగా ‘అవతార్ 2’ని వెంకటేష్ ‘నారప్ప’తో పోలుస్తున్నారు. ‘నార‌ప్ప’ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే ఒక తండ్రి. ఈ క్రమంలో శత్రువుల దాడిలో ఒక కొడుకుని కోల్పోతే నారప్ప సమర శంఖం ఎలా పూరిస్తాడు.. అనేది నారప్ప కథ. మిగతా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నారప్ప త‌న ప్ర‌త్య‌ర్ధుల‌తో ఎలా పోరాడాడు? అనేది తమిళంలో తమిళ నేటివిటీ, తెలుగులో తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీశారు. ఇక నార‌ప్ప‌, అవ‌తార్ 2ల‌కు పోలిక యాదృచ్ఛికమే. అయితే కొందరు కామెరూన్ నార‌ప్ప‌ను కాపీ కొట్టాడంటూ సరదా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి నారప్పను కామెరూన్‌ చూస్తే ఎలా స్పందిస్తాడో..? అవతార్ రిలీజ్ అనంతరం ఇలాంటి పోలికలు తెరపైకి చాలా వచ్చాయి.

‘వియత్నాం కాలనీ’ అనే సినిమా కథ.. అవతార్‌ క‌థ‌ పోలి ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ మూవీ. ఓ కాలనీవాసులను ఖాళీ చేయించడానికి విలన్ బ్యాచ్ హీరోను అక్కడికి పంపడం… ఆ తర్వాత వాళ్లలో కలిసిపోయి ఆ హీరో విలన్ బ్యాచ్‌ని ఎదిరించడంతో ఈ కథ సాగుతుంది. అవతార్1 పండోరా గ్రహం నేపథ్యంలో సాగే స్టోరీ. ఆ గ్రహం మీదకు వెళ్ళిన మానవాళిని నావీ జాతి తెగ ఎలా అంతమొందించింది? అన్నది పాయింట్‌. ఇలాంటి పోలికల స‌హ‌జ‌మే. సోల్ కనెక్ట్ అవుతుంది అయినా ఓ హాలీవుడ్ సినిమాను తెలుగు సినిమా తరహాలో ఎమోషన్ తీసుకురావడం అన్నది విశేషంగా భావించాలి.

Exit mobile version