Vinayaka | వినాయ‌కుడిని పోలిన వింత శిశువు జ‌న‌నం.. పుట్టిన‌ 20 నిమిషాల‌కే మృతి

Vinayaka | వినాయ‌కుడిని పోలిన వింత శిశువు జ‌న్మించాడు. ఆ శిశువు పుట్టిన 20 నిమిషాల‌కే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని దౌసా జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. అల్వార్ జిల్లాకు చెందిన ఓ గ‌ర్భిణికి నెల‌లు నిండడంతో కాన్పు కోసం దౌసా జిల్లా ఆస్ప‌త్రికి జులై 31వ తేదీన వెళ్లింది. అదే రోజు రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో మ‌గ శిశువుకు ఆమె జ‌న్మ‌నిచ్చింది. అయితే పుట్టిన శిశువు వినాయ‌కుడిని పోలి ఉన్నాడు. […]

  • Publish Date - August 2, 2023 / 11:20 AM IST

Vinayaka |

వినాయ‌కుడిని పోలిన వింత శిశువు జ‌న్మించాడు. ఆ శిశువు పుట్టిన 20 నిమిషాల‌కే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని దౌసా జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అల్వార్ జిల్లాకు చెందిన ఓ గ‌ర్భిణికి నెల‌లు నిండడంతో కాన్పు కోసం దౌసా జిల్లా ఆస్ప‌త్రికి జులై 31వ తేదీన వెళ్లింది. అదే రోజు రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో మ‌గ శిశువుకు ఆమె జ‌న్మ‌నిచ్చింది. అయితే పుట్టిన శిశువు వినాయ‌కుడిని పోలి ఉన్నాడు.

గ‌ణేశుడికి తొండెం ఉన్న‌ట్టే ఆ ప‌సిపాప‌కు కూడా ముక్కు వ‌ద్ద తొండెం ఉంది. మిగ‌తా శ‌రీర భాగాల‌న్ని సాధార‌ణంగానే ఉన్నాయి. పుట్టిన 20 నిమిషాల‌కే శిశువు చ‌నిపోయాడు. వినాయ‌కుడిని పోలిన శిశువును చూసి ఆస్ప‌త్రి వైద్యులు, న‌ర్సులు షాక్ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా ఆస్ప‌త్రి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ శివ‌రాం మీనా మాట్లాడుతూ.. జ‌న్యు ప‌ర‌మైన లోపాల కార‌ణంగా పిల్ల‌లు ఇలా జ‌న్మిస్తుంటార‌ని తెలిపారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం క్రోమోజోమ‌ల్ డిజార్డ‌ర్స్ అని పేర్కొన్నారు. ప్ర‌తి గ‌ర్భిణి కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా రెగ్యుల‌ర్‌గా చెక‌ప్స్ చేయించుకోవాల‌ని సూచించారు.

Latest News