Site icon vidhaatha

Bandi Sanjay | మీ తీర్పుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది: బండి సంజయ్

బండి గెలుపు కోసం రిటైర్డ్ ఉద్యోగుల ప్రచారం
రిటైర్డ్ ఉద్యోగులు రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన సంజయ్

విధాత బ్యూరో, కరీంనగర్: ‘‘వచ్చేనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇవ్వబోయే తీర్పుపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ఒకవైపు…కుటుంబ పాలన,అవినీతి, వారసత్వ రాజకీయాలతో దేశాన్ని తిరోగమనంవైపు నడిపించే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కూటమి ఒకవైపు నిలబడ్డాయి… దేశ రక్షణ, ధర్మరక్షణ, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోరుకునే కరీంనగర్ ప్రజలు ఎటువైపు నిలబడాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రిటైర్డ్ ఉద్యోగులు అన్నారు.

‘‘బీజేపీని గెలిపిద్దాం… భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం’’ అంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించారు.దేశానికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ చేసిన కృషి కి సంబంధించిన వివరాలతో రిటైర్డు ఉద్యోగులు కరపత్రం రూపొందించారు.

శ‌నివారం ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉపాధ్యాయుడు ఎడమ సత్యనారాయణ రెడ్డి, రిటైర్డ్ ఎస్ఐ లాల మురళి తదితరులు పాల్గొన్నారు.

2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే పేదలకు అంకితం కావాలని సంకల్పం తీసుకున్న ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని తెలిపారు. వివిధ పథకాల కింద దళారుల ప్రమేయం లేకుండా దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలను ఆయన నేరుగా పేదలు, రైతులు, మహిళలు, యువ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన విషయాన్ని తమ కరపత్రంలో గుర్తు చేశారు. ఆయుష్మాన్ యోజన, జన్ ఔషధి కేంద్రాలు కోట్లాది మందికి వరంలా మారాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్, ఆత్మనిర్భర్ భారత్ వంటి అభివృద్ధి పథకాలం 140 కోట్ల మంది ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ కుటుంబ పాలనలో దేశం కుంభకోణాల్లో ఇరుక్కుని, ఆర్థికంగా చితికిపోయిన దశలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ప్రభుత్వానికి విశ్వసనీయత పెంచారన్నారు.

దాదాపు 5 వందల ఏళ్ల హిందువుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయాన్ని సహకారం చేశారని,370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్య్రం అందించారని, ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించారని,మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించే దిశగా బిల్లును ఆమోదించారని కొనియాడారు.

పార్లమెంట్ సభ్యునిగా గడచిన ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ కుమార్ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి 12 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు తీసుకొచ్చారని తెలిపారు. కొంతమంది ఎంపీగా సంజయ్ ఏమి చేశారంటూ, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రచారాలను తిప్పి కొట్టి, రెండవసారి ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్లమెంట్ ఓటర్ల పై ఉందన్నారు.

Exit mobile version