రంజాన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర వీధుల్లో ఎక్కడ అంటే అక్కడ హలీం సెంటర్లు దర్శనమిస్తాయి. ఆ హలీం వాసనతో కడుపు నిండిపోతోంది. ప్రధానంగా మటన్, చికెల్ హలీంను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి మాంసాహారులకు మటన్, చికెన్ హలీం లభ్యమవుతోంది. అయితే శాఖాహారులు మాత్రం హలీంను తినలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్‌లో ప్యూర్ వెజ్ హలీం సెంటర్లు కూడా వెలిశాయి. హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో వెజ్ హలీం దొరుకుతోంది. అవి ఏయే ప్రాంతాల్లో అంటే సైనిక్‌పురి, బంజారాహిల్స్, సికింద్రాబాద్, అమీర్ పేట ప్రాంతాల్లో.
ఈ వోక్
ఈ వోక్ వెజ్ రెస్టారెంట్ సైనిక్‌పురిలో ఉంది. ఇక్కడ వెజ్ వంటకాలు ప్రత్యేకం. వేగన్ బోలోగ్నీస్ పిజ్జా, జీడిపప్పు క్రంచ్ బౌల్, స్పైసీ కార్న్ చీజ్ రోల్, రామెన్ బౌల్ నుండి వేగన్ లాసాగ్నా వరకు రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. మీరు వెజ్ హలీం తినాలనుకుంటే తప్పనిసరిగా ఈ వోక్‌లో వాలిపోవాల్సిందే. చిరు ధాన్యాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, గింజలతో హలీంను తయారు చేస్తున్నారు. దీని ధర కేవలం రూ. 400 మాత్రమే.
టెర్రస్సేన్ కేఫ్
టెర్రస్సేన్ కేఫ్ బంజారాహిల్స్‌లో ఉంది. నోరూరించే హలీం ఇక్కడ ప్రత్యేకత. హలీంను రూ. 300కు విక్రయిస్తున్నారు. సాయంత్రం వేళ అందుబాటులో ఉంటుంది.
వివాహ భోజనంబు
వివాహ భోజనంబు బ్రాంచ్‌లు హైదరాబాద్‌లో అనేకం ఉన్నాయి. సికింద్రాబాద్ బ్రాంచ్‌లో మాత్రమే వెజ్ హలీం అందుబాటులో ఉంది. ఇక్కడ రూ. 350కి హలీంను విక్రయిస్తున్నారు. స్విగ్గీ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ హలీం ఎందుకు తినకూడదు..? అనే మోటోతో హలీంను విక్రయిస్తున్నారు.
గ్రీన్ పార్క్
అమీర్‌పేటలోని హోటల్ గ్రీన్ పార్కులో కూడా స్పైసీ వెజ్ హలీం అందుబాటులో ఉంది. మిక్స్‌డ్ వెజిటబుల్స్‌తో హలీంను తయారు చేస్తున్నారు. గోధుమలు, సుగంధ ద్రవ్యాలను కూడా వినియోగిస్తున్నారు. వేయించిన ఉల్లిపాయ, జీడిపప్పుతో నోరూరించేలా హలీంను తయారు చేస్తున్నారు. ఇక్కడ రూ. 325కు విక్రయిస్తున్నారు. స్విగ్గీ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.