Site icon vidhaatha

Hyderabad | వామ్మో తెగ తిన్నారుగా! రంజాన్‌ నెలలో.. 10 లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీం ఆర్డర్లు!

Hyderabad |

రంజాన్‌ మాసం ముస్లింలకు ప్రీతికరమైంది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్‌ మాసం. ఈ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో ముస్లింలు సూర్యోద‌యానికి ముందు సూర్యాస్తమయం వరకు ఆహారం తీసుకోరు.

కనీసం నీటిని కూడా తాగరు. అయితే, ఈ సారి రంజాన్ మాసంలో హైదరాబాద్‌లో (Hyderabad ) బిర్యానీలు, హలీంల విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దాదాపు 10లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీంలు డెలివరీ చేసినట్లు స్విగ్గీ ప్రకటించింది.

గత రంజాన్ కంటే ఈ ఏడాది 20 శాతం అధికంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలు జరిగాయి. చికెన్‌ బిర్యానీ, హలీంతో పాటు సమోసాలు, భాజియా, మల్పువా, ఫిర్ని, రబ్ది లాంటి ఫుడ్ ఐటెమ్స్ సైతం రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి.

డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయని, మెజార్టీ మాత్రం హలీం, బిర్యానీలకే వచ్చిందని స్విగ్గీ పేర్కొంది. ఇఫ్తార్ సమయంలో పిస్తా హౌస్ హలీం, ప్యారడైస్, మెహ్‌ఫిల్ రెస్టారెంట్ల నుంచి హైదరాబాదీలు(Hyderabad) ఎక్కువగా ఆర్డర్లు పెట్టారు. ఉపవాసాలు చేస్తున్న ముస్లింలు దీక్ష విరమించేందుకు స్విగ్గీ, జొమాటో తదితర ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలకే ఎక్కువ మొగ్గు చూపారు.

Exit mobile version