Birds Sucide | వేల కొద్దీ ప‌క్షులు ఆత్మార్ప‌ణ చేసుకునే ప్ర‌దేశం.. అంతుబ‌ట్టని కార‌ణాలు

Birds Sucide | అస్సాంలోని ఓ లోయలో వ‌చ్చే రెండు నెల‌ల పాటు ఆత్మ‌హ‌త్య‌లు నేల‌ను గుద్దుకుని మ‌ర‌ణించే వివిధ జాతుల ప‌క్షులు అక్క‌డ రుతుప‌వ‌నాలు ముగింపు ద‌శ‌కు రాగానే.. వేల కొద్దీ ప‌క్షులు ఎవ‌రో పిలిచిన‌ట్లు నేల వైపు దూసుకొస్తాయి. కావాల‌ని నేల‌ను ఢీకొట్టి మృత్యువాత ప‌డ‌తాయి. ప‌క్షుల ఆత్మ‌హ‌త్య‌ల లోయ‌గా పిలిచే ఈ ప్రాంతం అస్సాంలోని గౌహ‌తికి 330 కి.మీ.లో దూరంర‌లో ఉంది. అదే దిమాసా హ‌స్సా జిల్లాలో ఉన్న జ‌తింగా వ్యాలీ. ఇక్క‌డ […]

  • Publish Date - August 28, 2023 / 10:49 AM IST

Birds Sucide |

  • అస్సాంలోని ఓ లోయలో వ‌చ్చే రెండు నెల‌ల పాటు ఆత్మ‌హ‌త్య‌లు
  • నేల‌ను గుద్దుకుని మ‌ర‌ణించే వివిధ జాతుల ప‌క్షులు

అక్క‌డ రుతుప‌వ‌నాలు ముగింపు ద‌శ‌కు రాగానే.. వేల కొద్దీ ప‌క్షులు ఎవ‌రో పిలిచిన‌ట్లు నేల వైపు దూసుకొస్తాయి. కావాల‌ని నేల‌ను ఢీకొట్టి మృత్యువాత ప‌డ‌తాయి. ప‌క్షుల ఆత్మ‌హ‌త్య‌ల లోయ‌గా పిలిచే ఈ ప్రాంతం అస్సాంలోని గౌహ‌తికి 330 కి.మీ.లో దూరంర‌లో ఉంది.

అదే దిమాసా హ‌స్సా జిల్లాలో ఉన్న జ‌తింగా వ్యాలీ. ఇక్క‌డ ప‌చ్చ‌ని కొండ‌లు, భారీ లోయ‌లు,న‌దులు కాలువ‌ల‌తో జీవ వైవిధ్యం ఉట్టి ప‌డుతుంది. రుతుప‌వ‌నాలు ముగింపు ద‌శ‌కు వ‌చ్చే సెప్టెంబ‌రు, అక్టోబ‌రు నెల‌ల్లో ఈ ప‌క్షుల ఆత్మ‌హ‌త్య‌లు చోటు చేసుకుంటాయి.

ఆ రెండు నెలల్లో ప్ర‌తి రోజూ రాత్రి ఏడు గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు వేల కొద్దీ ప‌క్షులు కావాల‌ని నేల‌కు గుద్దుకుని మ‌ర‌ణిస్తాయి. అయితే ఇది కేవ‌లం ఏదో ఒక జాతి ప‌క్షుల్లో జ‌రుగుతుంద‌నుకుంటే పొర‌పాటే. టైగ‌ర్ బిట్ట‌ర్న్‌, బ్లాక్ బిట్ట‌ర్న్‌, లిటిల్ ఈగ్రెట్‌, పాండ్ హెరోన్‌, ఇండియ‌న్ పిట్ట‌, కింగ్‌ఫిష‌ర్ ఇలా అక్క‌డ ఉండే చాలా జాతి ప‌క్షులు ఇక్క‌డ గ్రేట్ సూసైడ్‌లో త‌మ ప్రాణాల‌ను కోల్పోతాయి.

ఏమిటీ కార‌ణం?

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. ఇక్క‌డ ఉన్న ప్రత్యేక భౌతిక ప‌రిస్థితులే ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. కొండల మ‌ధ్య సుడులు తిరిగే భారీ గాలులు, సెప్టెంబ‌రు, అక్టోబ‌రుల్లో అక్క‌డ కురిసే మంచు, వీటితో పాటు ఈ ప్రాంతం స‌ముద్ర‌మ‌ట్టానికి చాలా ఎత్తున ఉండ‌టంతో ఎంతో ఎత్తున ఎగురుతున్న ప‌క్షులు పొర‌పాటున‌ గ‌తి త‌ప్పి నేరుగా నేలను ఢీ కొంటున్నాయ‌ని భావిస్తున్నారు. మ‌రికొంద‌రి థియ‌రీ ప్ర‌కారం.. ఎందుకో తెలియ‌దు కానీ ఇక్క‌డి అయ‌స్కాంత త‌రంగాలు ప‌క్షులను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని వివ‌రిస్తున్నారు. దీంతో వాటి మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తిని జ‌తింగా గ్రామంలో క‌నిపిస్తున్న లైట్ వైపు దూసుకొచ్చి నేల‌ను ఢీకొడుతున్నాయ‌ని చెబుతున్నారు.

ఏదేమైనా ఇక్క‌డ ప‌క్షులు కావాల‌ని ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం లేద‌న్న‌ది రుజువైన విష‌యం. కానీ వాటిని ఏదో ప‌క్క‌దోవ ప‌ట్టించి ఇలా చేస్తోంది. వాటి గ‌మ‌నంలో గ‌తి త‌ప్పి ఇలా జ‌రుగుతోంది త‌ప్ప‌.. వాటిక‌వి కావాల‌ని ఈ చావుల‌ను కోరుకోవ‌డం లేదు. అంతేకాకుండా జ‌తింగా గ్రామ‌స్థుల స్వార్థం కూడా ఈ ప‌క్షుల ఆత్మార్ప‌ణ‌లో కీల‌కంగా మారింది. వారు కావాల‌ని ఈ రెండు నెల‌ల్లో టార్చ్‌లైట్లను వెలిగించి ఆకాశం వైపు చూపడం ద్వారా వాటిని నేల వైపు దూసుకొచ్చేలా చేస్తారు.

ఇలా చనిపోయిన ప‌క్షుల‌ను ఆహారంగా తీసుకుంటారు. వారు త‌మ‌కు దేవుడు పంపిన ప్ర‌సాదంగా వీటిని భావించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇటీవ‌ల అట‌వీ శాఖాధికారులు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు జ‌తింగా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో.. చ‌నిపోతున్న ప‌క్షుల సంఖ్య‌లను 40 శాతానికి పైగా తగ్గించ‌గ‌లిగారు.

బెర్ముడా ట్ర‌యాంగిల్ ఆఫ్ బ‌ర్డ్స్ గా ఈ ప్రాంతం ర‌హ‌స్యం మాత్రం ఇప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌లేదు. శాస్త్రవేత్త‌లు ప‌లు సిద్ధాంతాల‌ను ప్ర‌తిపాదించినా వాటిని నిర్దిష్టంగా నిరూపించ‌లేక‌పోయారు. అయితే గ్రామ‌స్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగే రెండు నెలల్లో రాత్రుళ్లు త‌క్కువ లైట్లు ఉప‌యోగించేలా వారిని ఒప్పించ‌డంతో ప‌క్షుల మ‌ర‌ణాల‌ను మాత్రం త‌గ్గించారు.

Latest News