Site icon vidhaatha

ఉప్పల్ స్టేడియంలో మరో సారి టికెట్లు మాయం

 

విధాత : ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 25న ఎస్‌ఆర్‌హెచ్‌-బెంగుళూర్ మ్యాచ్‌, మే 2వ తేదీన జరుగాల్సిన ఎస్‌ఆర్‌హెచ్‌-రాజస్థాన్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయంలో అవకతవకలు మరోసారి క్రీడాభిమానులను నిరాశకు గురి చేశాయి. పేటీఎంలో టికెట్ల విక్రయం పెట్టగా, నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని రావడంతో క్రికెట్ అభిమానులు ఖంగుతిన్నారు.

ఆన్‌లైన్ టికెట్ల విక్రయాల మాటున ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం టికెట్లను బ్లాక్ మార్కెట్ చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. అసలు ఎన్ని టికెట్లు పేటీఎంలో విక్రయానికి పెట్టారన్న వివరాలు కూడా వెల్లడించని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వైఖరిని తప్పుబడుతున్నారు.

Exit mobile version