Site icon vidhaatha

BREAKING | పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు మృతి

BREAKING |

విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి గత మూడు రోజుల క్రితం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు.

దీంతో ఎమ్మెల్యే కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. బంధువులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి జాండిస్‌ వ్యాధితో బాధ పడుతున్నారు.హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున ఆరోగ్యం వికటించి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు నేరుగా ఆసుపత్రికి వెళ్లి విష్ణు వర్ధన్ రెడ్డి బౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

Exit mobile version