Site icon vidhaatha

Bridge Collapses| గుజరాత్ లో కూలిన వంతెన.. నదిలో పడ్డ వాహనాలు

విధాత: గుజరాత్ రాష్ట్రం వడోదరా జిల్లా మహిసాగర్‌ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో రెండు లారీలతో సహా నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. ముగ్గురు చనిపోగా..సహాయక బృందాల సిబ్బంది 10మందిని రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేసిన అధికారులు వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించారు. దాదాపు 45ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరినప్పటికి భారీ వాహనాలను దానిపై నుంచి అనుమతించడం..తాజాగా భారీ వర్షాలు పడిన నేపథ్యం బ్రిడ్జి కూలడానికి కారణమైంది. వడదోరా ఆనంద్ పట్టణాల మధ్య ఉన్న ఈ బ్రిడ్జి కూలడంతో రెండు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ మరోసారి బట్టబయలు: కేటీఆర్

మోర్బీ వంతెన కూలి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువకముందే, డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ ఉన్న గుజరాత్‌లో మరో వంతెన నదిలో కూలిపోయిందని..దీంతో బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గుజరాత్‌లో, డబుల్ ఇంజన్ ఉన్న బీహార్, మధ్యప్రదేశ్‌లలో వంతెనలు వరుసగా ఎందుకు కూలుతున్నాయి? వీటిపై ఎన్‌డీఎస్ఏ లేదా ఇతర భద్రతా సంస్థలు విచారణ జరుపుతాయా? లేదా అని ప్రశ్నించారు. ఇదేనా మీరు గొప్పలు చెప్పుకునే గుజరాత్ ‘మోడల్’? ప్రజల ప్రాణాలు తీసే నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి! అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

 

Exit mobile version