ఆరెస్పీని పట్టించుకోని బీఆరెస్‌

పెనం నుంచి పొయ్యి లో పడ్డట్లు అయింది ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి. బహుజను లను అభివృద్ధి చేయాలనే సిద్ధాంతం పెట్టుకున్న ఆయన తన ఉద్యోగాన్ని వదిలి ప్రజల్లోకి వచ్చారు

  • Publish Date - April 14, 2024 / 03:55 PM IST

– నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
– బీఎస్ పి నుంచి బీఆర్ ఎస్ లోకి వచ్చినా ఆర్ ఎస్ కు ప్రాధాన్యత ఇవ్వని గులాబీ పార్టీ క్యాడర్
– బహుజన అభివృద్ధి కార్డు తో రాజాకీయాల్లోకి వచ్చిన ఆర్ ఎస్ వారి నుంచి మద్దతు కరువు
– పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ లో ఉన్న గుర్తించని గులాబీ పార్టీ శ్రేణులు
– టికెట్ కేటాయించి నెల గడుస్తున్నా ప్రచారం లో కనపడని ప్రవీణ్ కుమార్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పెనం నుంచి పొయ్యి లో పడ్డట్లు అయింది ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి. బహుజను లను అభివృద్ధి చేయాలనే సిద్ధాంతం పెట్టుకున్న ఆయన తన ఉద్యోగాన్ని వదిలి ప్రజల్లోకి వచ్చారు. రాజ్యాంగం కలిపించిన బహుజన హక్కులకోసం ఆ వర్గాల్లో చైతన్యం కలిగించే విధంగా ఆయన తన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఆయన పలు ఉద్యమాలు చేపట్టి బహుజనులను ఒక్క తాటి పై నిలిపేందుకు కృషి చేశారు. బహుజనుల అభివృద్ధి కోసమే రాజకీయ పార్టీ పెట్టిన మాయవతి ప్రాతినిధ్యం వహిస్తున్న బీ ఎస్ పి పార్టీ లో ప్రవీణ్ కుమార్ చేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు.అప్పటి నుంచి బహుజన వర్గాన్ని భాలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు.తెలంగాణ లో అన్యాయానికి గురవుతున్న బహుజనుల ను అండగా నిలిచి బీ ఆర్ ఎస్ ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు.రాష్ట్రం లో ఆ వర్గాల హక్కుల సాధన కోసం ప్రభుత్వం పై పోరాటం చేశారు. బహుజనులు కూడా ప్రవీణ్ కుమార్ మాటలను గౌరవించేవారు. ఒక సమయం లో ప్రవీణ్ కుమార్ను ఎవ్వరు విమర్శించినా బహుజన సమాజం తీవ్రంగా ఖండించారు. బహుజనులకు ఆరాధ్యంగా మారిన ప్రవీణ్ కుమార్ ఎవ్వరూ ఊహించని విధంగా కెసిఆర్ పంచన చేరారు. బహుజనుల సంక్షేమ మం కోసం ఏర్పాటు చేసిన పార్టీ ని వదిలి, ఆయన ఆశయ సాధనను వదిలి దొరల పంచన చేరారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఇవేమి పట్టించుకోకుండా ఆయన తన రాజకీయ జీవితం లో ముందుకుసాగుతున్నారు.

బహుజన వాదానికి తిలోదకాలేనా :
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితం పార్లమెంట్ ఎన్నికలు కుదుపేశాయి. తెలంగాణ రాష్ట్రం లో బీ ఎస్ పి మంచి పేరున్న నేతగా కొద్ది రోజుల్లో పేరు తెచ్చుకున్నారు. పార్టీ అధిష్టానం ఇది దృష్టిలో పెట్టుకుని నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీ ఎస్ పి అభ్యర్థి గా పోటీ చేసేందుకు ఆర్ ఎస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ వచ్చిన తరువాత బీ ఎస్ పి అధిష్టానానికి చెప్పకుండా కెసిఆర్ తో పొత్తు మంతనాలు జరిపారు. బీ ఆర్ ఎస్ తో బీ ఎస్ పి పొత్తు పెట్టుకుందని కెసిఆర్, ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.ఈ నిర్ణయం మేరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం లో బీ ఆర్ ఎస్ పోటీ లో ఉండదని, బీ ఎస్ పి మద్దతుగా ఉంటుందని ప్రవీణ్ కుమార్ పత్రికా ముఖంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న బీ ఎస్ పి అధినేత్రి మాయవతి స్పందించి బీ ఆర్ ఎస్ తో బీ ఎస్ పి పొత్తు లేదని ప్రకటించడం తో ప్రవీణ్ కుమార్ ఖంగుతిన్నారు. మాయవతి ప్రకటన తో విస్తుపోయిన ప్రవీణ్ బీ ఎస్ పి కి రాజీనామా చేసి కెసిఆర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి టికెట్ దక్కించుకున్నారు. బహుజన వాదాన్ని పక్కన పెట్టి దొర గడీ ల్లోకి వెళ్లారని ఆ వర్గం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకాలం బీ ఆర్ ఎస్ ను ఎదిరించి.. కెసిఆర్ బహుజన వర్గానికి వ్యతిరేకం గా ఉన్నారని పోరాడిన ఆర్ ఎస్ చివరకు అదే పార్టీ లో చేరడం తో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. అధికారం… పదవులు ముఖ్యం కాదని.. బహుజనుల అభివృద్ధి ముఖ్యమని ప్రకటించిన ప్రవీణ్ కుమార్ పదవుల కోసమే గులాబీ పార్టీ చెంతకు చేరారని బహుజన వర్గం అగ్రహానికి గురవుతున్నారు.బహుజన వాదానికి తిలోదాకాలిచ్చి పదవి కోసం ఆరాటపడుతున్న ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితం మసక భారడం తప్పదని కొందరు ఆ వర్గం నేతలు పేర్కొంటున్నారు.

బీఆరెస్‌ లో ఒంటరైన ఆరెస్పీ :
బహుజన పార్టీ ని వదిలి బీఆరెస్‌ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల భారీ లో ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారానికి దూరంగా ఉన్నారు.టికెట్ కేటాయించి నెల రోజులు గడిచినా నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో నేటికీ ప్రచారానికి ముందుకు రాలేదు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా రెండింటి లో మాత్రమే బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు ఉన్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే లు ఉండగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు ఉన్నారు. రోజు రోజు కు గులాబీ పార్టీ కి ఆదరణ తగ్గడం తో ఆ పార్టీ ని వీడే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇక్కడ బీ ఆర్ ఎస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాల్సిన ఉంటోంది. కాని ఆ పార్టీ నుంచి పోటీ లో ఉన్న ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు సభలు, సమావేశాలు నిర్వహించ లేదు. పార్టీ నేతలు కూడా ఆయన ను పెద్ద గా పట్టించుకోవడం లేదు. గులాబీ పార్టీ అధిష్టానం కూడా ఈ నియోజకవర్గం పై దృష్టి సారించక పోవడం తో ప్రవీణ్ కుమార్ ఒంటరి వాడయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రచారం లో దూ సుకులుతున్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ మాత్రం ప్రచారం లో పూర్తి గా వెనుకబడింది.

Latest News