Site icon vidhaatha

Son Attempt Murder His Mother| కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కసాయి కొడుకు

విధాత : మానవ సంబంధాలు రానురాను మరింత దారుణంగా దిగజారిపోతున్నాయి. ఓ కసాయి కొడుకు తన కన్నతల్లిపైనే పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన ఘటన మానవత్వానికే ప్రశ్నగా మారింది. చనిపోయాక చితికి నిప్పంటించాల్సిన కొడుకు ప్రాణాలతో ఉండగానే నిప్పంటించడంతో ఆ వృద్ధ తల్లి మంటల్లో 80శాతం కాలిపోయి ఆసుపత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో చోటుచేసుకుంది. ముత్తినేని సతీశ్‌ తన తల్లి వినోద(60)తో శనివారం తెల్లవారుజామున డబ్బు విషయంలో గొడవపడ్డారు. ఈక్రమంలో ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

మంటలకు తాళలేక ఆ తల్లి కేకలు పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు ఆమె కేకలు విని పరుగున వచ్చి మంటలు ఆర్పేసి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తతం తల్లి వినోద పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఎస్సై నరేశ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version