Site icon vidhaatha

Passenger Train: ప్యాసింజర్ రైలులో మంటలు!

Passenger Train: ప్యాసింజర్ రైలు మంటలు చెలరేగడం కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ సమీపంలో నాగిరెడ్డి పల్లి రైల్వే స్టేషన్ కు ముందుగా డెమో ప్యాసింజర్‌ రైలులో మంటలను ప్రయాణికులు గుర్తించారు. వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. రైలును ఆపివేసి అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపు చేశారు. దీంతో గంట పాటు రైలు బీబీనగర్‌లో నిలిచింది.

ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version